Mega 157: మెగా 157 గ్యాంగ్ ఇదే..
ABN, Publish Date - Apr 01 , 2025 | 03:40 PM
చిరంజీవి (Chiranjeevi) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగా 157 వర్కింగ్ టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా కోసం వర్క్ చేయనున్న వారి వివరాలను పంచుకుంటూ చిత్ర బృందం ఓ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. అందులో ఇప్పటి వరకూ చిరంజీవి నటించిన సినిమాల్లోని పాత్రలను చెబుతూ ఒక్కొక్కరు వారు చేయనున్న డిపార్ట్మెంట్ ను వివరించారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్నట్లు తెలిపారు. ‘ఈ సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం’ అంటూ వీడియో చివర్లో చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన డైలాగ్ ఫాన్స్ లో ఉత్సాహం నింపింది.
Updated at - Apr 01 , 2025 | 03:40 PM