Nara Bhuvaneswari: ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తమన్ సంగీత విభావరి కారణం అదే..
ABN , Publish Date - Jan 21 , 2025 | 05:55 PM
ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ జరగనుంది. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ టీం ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించబోతోంది.

ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR trust)ఆధ్వర్యంలో ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ యుఫోరియా మ్యూజికల్ నైట్ జరగనుంది. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ టీం ఈ మ్యూజికల్ నైట్ నిర్వహించబోతోంది. దీనికి సంబంధించి మంగళవారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో అధికారిక ప్రకటన విడుదల చేశారు.
మేనేజింగ్ ట్రస్టీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. "ఎన్టీ రామారావు గారు ఎప్పుడు ఏదీ ఆశించలేదు. కష్టపడి పైకొచ్చిన వ్యక్తి. రాజకీయాల్లోకి కూడా బడుగు బలహీన వర్గాల భవిష్యత్తు కోసం వచ్చారు. వారికోసం 2రూ కిలో బియ్యం, ఆడపిల్లలకు ఆస్తి హక్కు చట్టం లాంటి వాటిని తీసుకువచ్చారు. అన్నగారి స్పూర్తితో చంద్రబాబు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించారు. గత 28 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వ సాయం లేకుండా ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తూ వస్తుంది. ఎవరు పిలవకపొయినా మా ట్రస్ట్ సేవలు అందిస్తోంది. రక్తదానం అనేది చాలామంది ప్రాణాలను నిలవుమబెడుతుంది. మా కార్యక్రమం కోసం తమన్ ను సంప్రదించాం. ఆయన చక్కని సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ఇదొక ఫండ్ రైజింగ్ కార్యక్రమం. దీని ద్వారా వచ్చిన డబ్బును ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తలసేమియా వ్యాధి క్యాంపులకు తల సేమియా వ్యాధి గ్రస్తుల చికిత్సకు ఉపయోగించబోతున్నాం’’ అని అన్నారు.
ఫిబ్రవరి 15వ తేదీన విజయవాడ ఇందిరా గాంధీ మునిసిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగబోతోంది. (SS Thaman Musical Show)
"లైఫ్ లో దేన్నైనా నిలబెట్టవచ్చు. ట్రస్ట్ ను నిలబెట్టడం చాలా కష్టం. ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారు ఎంతోమందికి స్పూర్తివంతులు. వారు స్థాపించిన ట్రస్ట్ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేయడం గర్వంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి చేసిన అభివృద్ధి ఏంటో మనం చూశాం.ఫిబ్రవరి 15 న విజయవాడ లో జరిగే ఈవెంట్ లో ఎన్టీఆర్ గారి ఉత్తమ పాటలు ఉంటాయి. మా టీమ్ మెంబర్స్ ప్రిపేర్ అవుతున్నాం" అని థమన్ అన్నారు