Ashish: వారసుడి విషయంలో తగ్గేదే లే అంటున్న ఆ ఇద్దరు
ABN , Publish Date - Apr 02 , 2025 | 03:36 PM
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తన 60వ చిత్రాన్ని అనౌన్స్ చేసింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీని శిరీష్ తనయుడు ఆశిష్ తో చేయబోతున్నారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తన సొంత నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి 60వ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమాను శిరీష్ తనయుడు ఆశిష్ (Ashish) హీరోగా వీరు నిర్మించబోతున్నారు. తమ బ్యానర్ లో మెయిన్ మైల్ స్టోన్ వంటి ఈ మూవీని 'రౌడీ బాయ్స్ (Rowdy Boys), లవ్ మీ (Love Me)' చిత్రాల హీరో ఆశిష్ తో చేయబోతునట్టు తెలిపారు. ఈ సినిమా ద్వారా ఆదిత్యరావు గంగాసాని దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా కోసం హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యంలో సెట్ వేశామని, ఆశిష్ లోకల్ గాయ్ గా కనిపించబోతున్నాడని చెప్పారు. ఈ నేపథ్యం కథకు రగ్గడ్ అండ్ గ్రిట్టీ ఎట్మాస్పియర్ తో ఇంటెన్స్ ని యాడ్ చేస్తుందని అన్నారు. ఇప్పటికే తన మునుపటి పాత్రలలో వెర్సటాలిటీని ప్రజెంట్ చేసిన ఆశిష్, ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ అవుతున్నాడని, మరింత ఇంటెన్స్, మాస్-ఓరియెంటెడ్ లుక్ లో కనిపించబోతున్నాడని రాజు, శిరీష్ తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ఎక్సయిట్మెంట్ ని మరింత పెంచుతూ, నిర్మాతలు న్యూ ట్యాలెంట్ కోసం ముఖ్యంగా హైదరాబాద్ యాసని ఫ్లూయంట్ గా మాట్లాడే వారి కోసం కాస్టింగ్ కాల్ ని అనౌన్స్ చేశారు. ఈ నటీనటుల ఎంపిక అన్ని వయసుల నటులకు ఓపెన్ గా వుంటుంది. ఈ సినిమాకి సంబధించిన ఇతర వివరాలను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు.
Also Read: Aditya 369: సింగీతం చెప్పిన ఆదిత్య 369 ముచ్చట్లు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి