Karate Kid - Legends : జాకీ చాన్ మూవీ ట్రైలర్ వచ్చేసింది

ABN , Publish Date - Apr 02 , 2025 | 04:40 PM

విజయ్ దేవరకొండ 'కింగ్ డమ్' విడుదల కాబోతున్న మే 30నే జాకీ చాన్ కీలక పాత్ర పోషించిన 'కరాటే కిడ్ : లెజెండ్స్' మూవీ విడుదల కాబోతోంది.

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఫ్రాంచైజీలలో 'కరాటే కిడ్' (Karate Kid) కూడా ఒకటి. దీని లేటెస్ట్ ఫ్రాంచైజ్ 'కరాటే కిడ్: లెజెండ్స్' ( Karate Kid: Legends). ఈ సినిమా మే 30న ఇంగ్లీష్‌, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఇండియాలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. విశేషం ఏమంటే... అదే రోజున విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) 'కింగ్ డమ్' (Kingdom) మూవీ సైతం పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతోంది. మరి ఈ నేపథ్యంలో 'కరాటే కిడ్ : లెజెండ్స్'కు తెలుగు రాష్ట్రాలలో తగినన్ని ధియేటర్లు దొరకుతాయో లేదో చూడాలి.


'కరాటే కిడ్' ఫ్రాంచైజీలో ఇప్పటివరకు లేని విధంగా, ఈ ఆరవ భాగంలో రెండు ఐకానిక్‌ పాత్రలు జాకీ చాన్ (Jackie Chan), రాల్ఫ్ మాకియో (Ralph Macchio) కలిసి తొలిసారి స్క్రీన్‌పై కనిపించనున్నారు. ట్రైలర్‌లో ఆ పాత్ర కోసం వారు కష్టపడిన విధానం, వారి శిక్షణ, మిస్టర్ మియాగీ లెగసీకి ఘన నివాళిని అందించడం... చూడొచ్చు. మే 30న రాబోతున్న ఈ సినిమా కథ లీ ఫాంగ్ అనే కుంగ్‌ ఫూ కుర్రాడి కేంద్రంగా సాగుతుంది. అతడు తన తల్లితో కలిసి న్యూయార్క్‌ నగరానికి వచ్చి ఓ ప్రముఖ పాఠశాలలో చేరతాడు. అక్కడ ఒక విద్యార్థిని, ఆమె తండ్రితో స్నేహం ఏర్పడుతుంది. అయితే ఒక లోకల్‌ కరాటే ఛాంపియన్‌తో గొడవలు మొదలవ్వడం అతని జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తరువాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా ఉండబోతోంది. తనను తానే రక్షించుకోవాలనే ఉద్దేశంతో, లీ ఫాంగ్‌... కుంగ్‌ ఫూ గురువు మిస్టర్ హాన్, లెజెండరీ కరాటే కిడ్ డేనియల్ లారూసోల నుంచి శిక్షణ తీసుకుంటాడు. ఇద్దరి శైలి మిళితంతో అతడు ఓ అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్‌ పోరుకు సిద్ధమవుతాడు. అందులో ఎలా విజేతగా నిలిచాడన్నదే క్లయిమాక్స్. జొనథన్ ఎన్‌ట్‌విసిల్ (Jonathan Entwistle) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాకీ చాన్, రాల్ఫ్ మాకియో, బెన్ వాంగ్ (Ben Wang), జోషువా జాక్సన్, సేడీ స్టాన్లీ, మింగ్-నా వెన్ ముఖ్య పాత్రలను పోషించారు.

Also Read: Ashish: వారసుడి విషయంలో తగ్గేదే లే అంటున్న ఆ ఇద్దరు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Apr 02 , 2025 | 04:54 PM