Ram Gopal Varma: నాలుగు భాషల్లో ఆరాధ్యదేవి శారీ...
ABN , Publish Date - Apr 02 , 2025 | 11:11 AM
రవిశంకర్ తో కలిసి రామ్ గోపాల్ వర్మ నిర్మించిన 'శారీ' చిత్రం ఏప్రిల్ 4న నాలుగు భాషల్లో రాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ సమక్షంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
రామ్ గోపాల్ వర్మ (Ram gopal varma) నిర్మాణ భాగస్వామ్యం, పర్యవేక్షణలో రూపుదిద్దుకుంది 'శారీ' (Saree)చిత్రం. ఏప్రిల్ 4న నాలుగు భారతీయ భాషల్లో ఈ సినిమా జనం ముందుకు వస్తోంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా 'ఎ' సర్టిఫికెట్ జారీ చేశారు. తాజాగా చిత్ర బృందం సమక్షంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆరాధ్యదేవి (Aaradhya Devi), సత్య యాదు (Satya Yadu) ప్రధాన పాత్రలు పోషించిన 'శారీ' సినిమాకు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించారు. వర్మ మూల కథను అందించారు. ఈ సినిమాను రవిశంకర్ వర్మ డైరెక్ట్ చేశారు. 'గులాబీ' చిత్రానికి సంగీతం అందించిన శశిప్రీతమ్ (Shashipreetham) మరోసారి 'శారీ' చిత్రానికి వర్క్ చేశారు. వర్మ సినిమాలకు వర్క్ చేయడం తనకు ఎప్పుడూ ఆనందాన్ని కలిగిస్తుందని, తన పాటలన్నింటినీ వర్మ కే అంకితం ఇస్తున్నానని ఆయన చెప్పారు.
'శారీ' సినిమా దర్శకుడు గిరి కృష్ణ కమల్ (Giri Krishna Kamal) ఎంతో కాలంగా తనతో ట్రావెట్ అవుతున్నాడని, తాను చెప్పిన మూలకథను అతను డెవలప్ చేసిన విధానం నచ్చి దర్శకత్వ బాధ్యతలు అప్పగించానని రామ్ గోపాల్ వర్మ అన్నాడు. ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఈ మూవీతో పరిచయం కావడం ఎంతో ఆనందంగా ఉందని ఆరాధ్యదేవి తెలిపింది. ఈ మూవీలో నటించడం తనకో వర్క్ షాప్ వంటిదని ఆమె అన్నారు. తన సహ నటుడు సత్య యాదుకు ఆరాధ్యదేవి కృతజ్ఞతలు చెప్పింది. ఈ సినిమాలో ఆరాధ్య దేవి అందంగా కనిపించడంతో పాటు పలు సన్నివేశాలలో డీ-గ్లామర్ గానూ నటించిందని, సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న దారుణాలను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశామని దర్శకుడు గిరి కృష్ణ కమల్ చెప్పారు. ఈ ఇంటెన్స్ డ్రామాలో ప్రతి పాత్ర బలమైనదేనని, వర్మ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని సత్య యాదు అన్నారు.
Also Read: Arya 2: ‘ఆర్య 2’ మళ్లీ వస్తున్నాడు.. ట్రైలర్ చూసేయండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి