Kannappa Team: ‘కన్నప్ప’ టీమ్‌ కష్టాన్ని అర్థం చేసుకోండి.. 

ABN , Publish Date - Apr 01 , 2025 | 07:38 PM

‘కన్నప్ప’ (kannappa) ప్రీమియర్‌ వేశారంటూ వచ్చిన వార్తలను చిత్ర బృందం ఖండించింది. ఆన్‌లైన్‌ వేదికగా ప్రచారమవుతున్న సమాచారాన్ని కొట్టిపడేసింది.


‘కన్నప్ప’ (kannappa) ప్రీమియర్‌ వేశారంటూ వచ్చిన వార్తలను చిత్ర బృందం ఖండించింది. ఆన్‌లైన్‌ వేదికగా ప్రచారమవుతున్న సమాచారాన్ని కొట్టిపడేసింది. ఈ మేరకు టీమ్‌ (Kannappa Team) ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘మార్చి 31న ‘కన్నప్ప’ ప్రీమియర్‌ వేశారంటూ ఆన్‌లైన్‌ వేదికగా వస్తున్న వార్తల్లో నిజం లేదు. వీఎఫ్‌ఎక్స్‌ విభాగానికి సంబంధించి 15 నిమిషాల ఫుటేజ్‌ క్వాలిటీని సమీక్షించాం. ‘కన్నప్ప’ ఫస్ట్‌ కాపీని సిద్థం చేసే పనులు నడుస్తున్నాయి. ఈ సినిమాకు వీఎఫ్‌ఎక్స్‌ పరిధి ఎక్కువ. అందుకే ప్రతి క్వాలిటీగా తీర్చిదిద్దుతుండటంతో మరింత సమయం అవసరమైంది. అభిమానులు, మీడియా అవాస్తవాలను వార్తలుగా రాయవద్దు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. ‘కన్నప్ప’ టీమ్‌ కష్టాన్ని అర్థం చేసుకుంటూ సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు’’

-టీమ్‌ కన్నప్ప

మోహన్‌బాబు, మంచు విష్ణు నడుచుకుంటూ వస్తున్న పలు వీడియోలు నెట్టింట వైరల్‌ కావడంతో ‘కన్నప్ప’ ప్రివ్యూ వేశారంటూ పోస్టులు దర్శనమిచ్చాయి. దీనిపై చిత్ర బృందం వివరణ ఇచ్చింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 25న విడుదల చేయాలని భావించినా, వీఎఫ్‌ఎక్స్‌ పనుల కారణంగా వాయిదా వేశారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని మంచు విష్ణు చెప్పారు.  

Updated Date - Apr 01 , 2025 | 07:43 PM