Charming Star: శర్వా ఆ రెండు సినిమాలు....
ABN , Publish Date - Mar 31 , 2025 | 03:36 PM
శర్వానంద్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. అందులో ఒకటి 'నారి నారి నడుమ మురారి' కాగా మరొకటి 1960 నేపథ్యంలో పీరియాడిక్ మూవీ. దీని కోసం శర్వా మేకోవర్ అవుతున్నాడు.
చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand) ప్రస్తుతం 'సామజవర గమన' ఫేమ్ రామ్ అబ్బరాజు (Ram Abbaraju) దర్శకత్వంలో 'నారి నారి నడుమ మురారి' (Naari Naari Naduma Murari) చిత్రంలో నటిస్తున్నాడు. షూటింగ్ దాదాపు పూర్తయిన ఈ సినిమాలో సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్లు. ఈ మూవీని అనిల్ సుంకర, రాంబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'నారి నారి మురారి' నుండి ఫస్ట్ టుక్, ఇతర పోస్టర్స్ వచ్చాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. ఏప్రిల్ 7న ఇందులోని 'దర్శనమే...' అనే పాటను రిలీజ్ చేయబోతున్నారు. ఈ పాటలో శర్వా, సంయుక్త నటించారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఒకటి రిలీజ్ అయ్యింది. వీరిద్దరూ రొమాంటిక్ గా బైక్ రైడ్ చేస్తూ అందులో కనిపించారు. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandra Sekhar) సంగీతం అందించారు. ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ వి.ఎస్., యువరాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. భాను భోగవరపు కథను సమకూర్చారు. నందు సావిరిగణ సంభాషణలు రాశారు.
ఇదిలా ఉంటే... శర్వానంద్, సంపత్ నంది (Sampath Nandi) కాంబోలోనూ ఓ సినిమా తెరకెక్కుతోంది. కె. కె. రాధామోహన్ దీనిని నిర్మిస్తున్నారు. ఇది 1960 చివరలో ఉత్తర తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో సెట్ చేసిన కథ. ఈ హై స్టేక్స్ పీరియడ్ యాక్షన్ డ్రామాలో శర్వానంద్ సరికొత్తగా కనిపించబోతున్నాడు. ఇందు కోసం బాలీవుడ్ స్టైలిస్టులు ఆలిమ్ హకీమ్, పట్టణం రషీద్ వర్క్ చేస్తున్నారు. శర్వా మేకోవర్ ఇప్పటికే సంచలనం సృష్టిస్తోందని మేకర్స్ తెలిపారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సౌందర్ రాజన్ ఎస్ సినిమాటోగ్రాఫర్. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుండి మొదలు కానుంది. దీనిని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తామని రాధామోహన్ చెబుతున్నారు.
Also Read: Sikandar Review: సికందర్ మూవీ రివ్యూ
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి