Pink Elephant Pictures: సంగీత్ తో నిహారిక సినిమా!
ABN , Publish Date - Apr 02 , 2025 | 06:59 PM
గత యేడాది వచ్చిన 'కమిటీ కుర్రోళ్ళు' సినిమా చక్కని విజయాన్ని అందకుంది. దాంతో ఆ చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల ఇప్పుడు రెండో సినిమాకు శ్రీకారం చుట్టింది.
విజయం ఇచ్చే కిక్ ఇంతా అంతా కాదు... ఆ సక్సెస్ ను 'కమిటీ కుర్రోళ్ళు' (Committee Kurrollu) మూవీతో నూరు శాతం ఆస్వాదించింది నిహారిక కొణిదెల (Niharika Konidela) . దాంతో వెబ్ సీరిస్ నిర్మాణంలోనూ వేగం చూపింది. తాజాగా తన ప్రొడక్షన్ హౌస్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ (Pink Elephant Pictures) నుండి రెండో సినిమాకూ ఆమె శ్రీకారం చుట్టారు. కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో 'కమిటీ కుర్రోళ్ళు' మూవీ తీసి విజయం అందుకున్న నిహారిక కొణిదెల ఈసారి కూడా మానస శర్మ (Manasa Sharma) ను దర్శకురాలిగా పరిచయం చేస్తోంది. అలానే 'మ్యాడ్ (Mad), మ్యాడ్ స్క్వేర్ (Mad Square) ' చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్న యువ కథానాయకుడు సంగీత్ శోభన్ (Sangeeth Shoban) ను హీరోగా ఎంపిక చేసుకుంది నిహారిక. విశేషం ఏమంటే సంతోష్ శోభన్ కు సోలో హీరోగా ఇదే మొదటి సినిమా.
ఇదిలా ఉంటే సంగీత్ శోభన్, మానస శర్మ గతంలోనే నిహారిక రూపొందించిన వెబ్ ప్రాజెక్ట్స్ లో భాగమయ్యారు. జీ 5తో కలిసి నిహారిక నిర్మించిన వెబ్ సీరిస్ 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' (Oka Chinna Family Story) లో సంగీత్ కీలక పాత్రను పోషించగా, మానస శర్మ రైటర్ గా వ్యవహరించారు. అలానే సోనీ లివ్ రూపొందించిన 'బెంచ్ లైఫ్' (Bench Life) కి మానస శర్మ దర్శకత్వం వహించారు. నిహారిక ఇప్పుడు మానసశర్మకు ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు రానున్న రోజుల్లో వెల్లడి కానున్నాయి. ఈ చిత్రానికి మానస శర్మ కథను అందించగా మహేష్ ఉప్పల కో రైటర్‌గా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
Also Read: Aamir Khan: లాపతా లేడీస్ మూవీపై నెటిజన్స్ సెటైర్స్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి