Allu Arjun - Trivikram: బన్నీ - త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ..
ABN , Publish Date - Apr 01 , 2025 | 05:36 PM
'పుష్ప-2' తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) చేయబోయే సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాపై నిర్మాత నాగవంశీ (Naga Vamsi) క్లారిటీ ఇచ్చారు.
'పుష్ప-2' తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) చేయబోయే సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాపై నిర్మాత నాగవంశీ (Naga Vamsi) క్లారిటీ ఇచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేయనున్ను సంగతి తెలిసిందే. ఇది పూర్తిగా మైథలాజికల్ జానర్ కథ అని నాగవంశీ చెప్పారు. ుూఅందరూ అనుకుంటునట్లు సోషియో ంటసీ చిత్రం కాదిది. పురాణాల ఆధారంగానే అన్ని సన్నివేశాలు ఉంటాయి. అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది’’ అని అన్నారు. ఈ సినిమాలో బన్ని.. కుమారస్వామిగా కనిపించనున్నారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. ఇప్పుడు నాగవంశీ కూడా మైథలాజికల్ జానర్ అని చెప్పడంతో బన్ని లుక్ ఎలా ఉంటుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కుమార్‌స్వామిగా బన్నీ ఎలా ఉంటారు అనేలా ఫొటోలు దర్శనమిస్తున్నాయి.
ఇదే ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘కింగ్‌డమ్’ గురించి కూడా ఆయన మాట్లాడారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రానున్న ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ‘కేజీయఫ్’ రేంజ్‌లో ఉంటాయి. ఆ సినిమాలో అన్ని లాజిక్‌లు ఉంటాయి. సందేహాలన్నింటికీ గౌతమ్ తన వర్క్‌తో సమాధానమిస్తారు. ఇది కచ్చితంగా హిట్ అవుతుంది. అలాగే రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘మాస్ జాతర’ అనుకున్న సమయానికి విడుదల కాకపోవచ్చని ఆయన చెప్పారు. జూలైలో విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు.