Mega 157: చిరంజీవి 157.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి హద్దే లేదు..

ABN , Publish Date - Mar 30 , 2025 | 12:15 PM

చిరంజీవి, అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. మెగా157 వర్కింగ్‌ టైటిల్‌తో ఉగాది సందర్భంగా ఆదివారం ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది.

Mega 157: చిరంజీవి 157.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి హద్దే లేదు..

చిరంజీవి (Chiranjeevi), అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. మెగా157 (MEGA 157) వర్కింగ్‌ టైటిల్‌తో ఉగాది సందర్భంగా ఆదివారం ఉదయం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. హీరో వెంకటేశ్‌, నిర్మాతలు అశ్వనీదత్‌, అల్లు అరవింద్‌, దగ్గుబాటి సురేశ్‌బాబు, దిల్‌ రాజు, నాగవంశీ, దర్శకులు రాఘవేంద్రరావు, వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాంత్‌ ఓదెల, రచయిత విజయేంద్ర ప్రసాద్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి విక్టరీ వెంకటేశ్‌ క్లాప్‌ కొట్టారు.

chiru.jpg

ఇందులో చిరంజీవి అసలు పేరుతో (శంకర్‌ వరప్రసాద్‌) నటించనున్నారు. తనదైన మార్క్‌ కామెడీ, యాక్షన్‌తో అనిల్‌ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటితో కలిసి చిరంజీవి తనయ సుస్మిత నిర్మిస్తున్నారు. ఇద్దరు హీరోయిన్లు నటించే అవకాశం ఉంది. ఓ పాత్ర కోసం అదితిరావు హైదరిని సంప్రదించారని సమాచారం. భీమ్స్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 30 , 2025 | 12:28 PM