Agent on Ott: ఎట్టకేలకు అఖిల్ ‘ఏజెంట్’కు దారి దొరికింది
ABN , Publish Date - Mar 06 , 2025 | 12:37 PM
అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా సురేందర్ రెడ్డి (Surendar reddy) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏజెంట్’ (Agent) సినిమా విడుదలై రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పటిదాకా ఓటిటీలో స్ట్రీమింగ్ కు నోచుకోలేదు.

అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా సురేందర్ రెడ్డి (Surendar reddy) దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏజెంట్’ (Agent) సినిమా విడుదలై రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పటిదాకా ఓటిటీలో స్ట్రీమింగ్ కు నోచుకోలేదు. తాజాగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సోనీ లివ్ (Sony liv) ముందుకు వచ్చింది. ఉత్కంఠను పెంచే ఈ స్పై థ్రిల్లర్ మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కథ:
రికీ అనే టాలెంటెడ్ రా ఏజెంట్‌కు ఓ క్లిష్టమైన మిషన్‌ను పూర్తి చేయాల్సిన బాధ్యతను అప్పగిస్తారు. ది డెవిల్ అనే పిలవబడే రా చీఫ్ కల్నల్ మహాదేవ్ ఈ పనిని రికీకి అప్పగిస్తాడు. ఈ క్రమంలో రికీ రహస్యంగా ఈ పనిని పూర్తి చేసే పనిలో ఉంటాడు. మరో వైపు ధర్మ అలియాస్ గాడ్ అనే మాజీ రా ఏజెంట్ భారతదేశాన్ని నాశనం చేయటానికి పథకం వేస్తాడు. మిషన్ అనుకోని మలుపులు తీసుకుంటుందనేది కథ.
ALSO READ: Tamannaah-Vijay varma: విడిపోవాలనుకోవడానికి కారణం ఏంటి.. కెరీర్ అడ్డం పడుతోందా..
‘ఏజెంట్’ చిత్రంలో అఖిల్ అక్కినేనితో పాటు మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, డినో మోరియా, సాక్షి వైద్య, డెంజిల్ స్మిత్, విక్రమ్‌జీత్ విర్క్ తదితరులు నటించారు. వక్కంతం వంశీ అందించిన కథకు దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాకు స్క్రీన్‌ప్లేను కూడా రచించారు. ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర, అజయ్ సుంకర, పతి దీపా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 14న సోనీ లివ్లో ఏజెంట్‌ను స్ట్రీమ్ చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి