Vishal: ఇళయరాజా వల్ల మద్యానికి బానిసయ్యారు.. మండిపడ్డ స్టార్ హీరో

ABN , Publish Date - Jan 27 , 2025 | 05:08 PM

" ఇండస్ట్రీలో ఉన్న వారందరికంటే నేనే ఎక్కువగా మద్యం తాగుతా. ఇళయరాజా సంగీతం వల్ల ఎంతోమంది మద్యానికి బానిసలయ్యారు"

Vishal: ఇళయరాజా వల్ల మద్యానికి బానిసయ్యారు.. మండిపడ్డ స్టార్ హీరో
Myskkin Viral Comments On Ilaiyaraaja

'మిస్కిన్‌' ప్రస్తుతం వార్తల్లో బాగా వినిపిస్తున్న పేరు. ఆయన ప్యారలల్ సినిమాలు తీస్తూ మంచి పేరును కూడా సంపాదించుకున్నారు. అలాగే విశాల్ నటించిన ‘తుప్పారివాలన్‌’ (డిటెక్టివ్‌) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. కాగా, ఇటీవల ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు 'ఇళయరాజా' గురించి అమర్యాదగా మాట్లాడారంటూ తమిళ సమాజం మండిపడుతుంది. ఈ నేపథ్యంలోనే హీరో విశాల్ కూడా విరుచుకుపడ్డారు. ఇంతకీ ఏం జరిగిందంటే..


అద్భుతమైన చిత్రాలను తెరెకెక్కిస్తూ.. అతి తక్కువ కాలంలో కల్ట్ ఫాలోయింగ్ సాధించిన దర్శకుడు మిస్కిన్. ఇటీవల ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ.. " ఇండస్ట్రీలో ఉన్న వారందరికంటే నేనే ఎక్కువగా మద్యం తాగుతా. ఇళయరాజా సంగీతం వల్ల ఎంతోమంది మద్యానికి బానిసలయ్యారు" అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. తర్వాత మిస్కిన్ నేను ఇవి కేవలం సరదాకి చేసిన వ్యాఖ్యలు మాత్రమే అంటూ క్లారిటీ ఇస్తూ క్షమాపణలు తెలిపిన కొందరు తమిళ నటులు మిస్కిన్ పై విరుచుకుపడుతున్నారు.


ఈ విషయంపై హీరో విశాల్ స్పందిస్తూ.. ‘‘అమర్యాదకర వ్యాఖ్యలు చేసేసి ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం ఆయనకు అలవాటుగా మారింది. మన మనసుకు అనిపించిన విషయాన్ని మాట్లాడే స్వేచ్ఛ ప్రతిఒక్కరికీ ఉంటుంది. కాకపోతే నలుగురిలో ఉన్నప్పుడు, స్టేజ్‌పై మాట్లాడేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. ఇళయరాజాను ఎంతోమంది ఆరాధిస్తుంటారు. అలాంటి వ్యక్తిని అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేయడాన్ని నేను ఏమాత్రం క్షమించను. ఇష్టం వచ్చినట్లు మాట్లాడేసి ఆ తర్వాత రోజు క్షమాపణలు చెబితే మీరు అంగీకరిస్తారా?’’ అంటూ విశాల్ ఫైర్ అయ్యారు.


అంతకు ముందు నటుడు అరుల్‌దాస్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రసాద్‌ ల్యాబ్‌లో అనేక సినీ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ప్రపంచంలోని గొప్ప గొప్ప కళాకారులు ఈ వేదికపై ప్రసంగించివుంటారు. వారంతా మిష్కిన్‌లా మాట్లాడివుండరు. ఎందుకంటే సభా మర్యాద అని ఒకటి ఉందనే విషయం వారికి బాగా తెలుసు. కానీ, మిష్కిన్‌కు ఇది తెలియదు. అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఇటీవల కూడా ‘అవన్‌దాన్‌ ఇళయరాజా’ (అతనే ఇళయరాజా) అంటూ వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడేందుకు మిష్కిన్‌కు ఉన్న అర్హత ఏంటి? తమిళ చిత్రపరిశ్రమంలో మీరు అంత గొప్పనటులా? ఒక నకిలీ మేధావి. మిష్కిన్‌ మాట్లాడిన మాటలు, మాట్లాడే తీరు నాకు ఏమాత్రం నచ్చలేదు. మంచి చిత్రాలను తెరకెక్కించిన ఆయన దర్శకుడుగా గుర్తింపు పొందలేదు. ఇంగ్లీష్‌ చిత్రాల్లోని సన్నివేశాలు, కంటెంట్‌ను కాపీకొట్టిన సూడో మేధావి మిష్కిన్‌. ఇది నా మనోవేదన. మిష్కిన్‌ మాటతీరును తీవ్రంగా ఖండిస్తున్నాను’’ అని నటుడు అరుల్‌దాస్‌ పేర్కొన్నారు. ఇప్పుడాయన మాటలు కోలీవుడ్‌లో సంచలనంగా మారాయి. అరుల్‌దాస్ వ్యాఖ్యలకు కొందరు సపోర్ట్ చేస్తుంటే.. మరికొందరు నువ్వు కూడా ఇలా ఒక దర్శకుడిని స్టేజ్‌పై అవమానించి.. ఆయనలానే బిహేవ్ చేశావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read- Allu Arjun: విధ్వంసం ఖాయమే.. ట్రెండింగ్ మార్కెట్‌ని పట్టుకున్నారు

Also Read-Meerpet Murder: సూక్ష్మదర్శిని సిరీస్ స్ఫూర్తితోనే శవాన్ని మాయం చేశాడు..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 27 , 2025 | 05:19 PM