హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్ కన్నుమూత
ABN , Publish Date - Apr 03 , 2025 | 03:34 AM
ప్రముఖ హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్ (65) ఇక లేరు. ‘బ్యాట్‌మ్యాన్ ఫరెవర్’, ‘టాప్ గన్’, ‘ద డోర్స్’ ‘హీట్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న వాల్ కిల్మర్....
ప్రముఖ హాలీవుడ్ నటుడు వాల్ కిల్మర్ (65) ఇక లేరు. ‘బ్యాట్‌మ్యాన్ ఫరెవర్’, ‘టాప్ గన్’, ‘ద డోర్స్’ ‘హీట్’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న వాల్ కిల్మర్.. మంగళవారం న్యూమోనియా వ్యాధితో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, థియేటర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు 1984లో విడుదలైన ‘టాప్ సీక్రెట్’ చిత్రం సినీ రంగప్రవేశానికి బాటలు వేసింది. 1986లో విడుదలైన ‘టాప్ గన్’ అనే చిత్రంలోని ‘ఐస్‌మ్యాన్’ పాత్ర ఆయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత 1991లో విడుదలైన ‘ద డోర్స్’ అనే చిత్రంలో ‘జిమ్ మోరిసన్’ పాత్రను పోషించి అందరినీ ఆకట్టుకున్నారు. 1995లో విడుదలైన ‘బ్యాట్‌మ్యాన్ ఫరెవర్’లో బ్యాట్‌మ్యాన్‌గా ప్రేక్షకాదరణ పొందారు.