వెంటాడే చిత్రం
ABN , Publish Date - Apr 03 , 2025 | 03:36 AM
క్రైమ్, అపరాధపరిశోధనాత్మక కథనంతో రూపొందిన చిత్రం ‘బ్లడ్ రోజ స్’. రంజిత్‌రామ్, అప్సరరాణి జంటగా నటించారు. ఎంజీఆర్ దర్శకుడు. టీబీఆర్ సినీ క్రియేషన్స్ నిర్మించింది...Blood Roses, Crime Thriller, Movie, Release, Ranjith Ram, Apsara Rani
క్రైమ్, అపరాధపరిశోధనాత్మక కథనంతో రూపొందిన చిత్రం ‘బ్లడ్ రోజ స్’. రంజిత్‌రామ్, అప్సరరాణి జంటగా నటించారు. ఎంజీఆర్ దర్శకుడు. టీబీఆర్ సినీ క్రియేషన్స్ నిర్మించింది. ఇటీవలే చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా బుధవారం చిత్రబృందం మీడియా సమావేశం నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘మంచి సినిమా చేయాలనే ప్రయత్నం ఈ చిత్రంతో నెరవేరింది. ఈ నెల చివరి వారంలో ‘బ్లడ్ రోజస్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అన్నారు. ప్రతి సన్నివేశం మనసులో నిలిచిపోయేలా ఉంటుంది. కథలోని భావోద్వేగాలు ప్రేక్షకులను చాలాకాలం పాటు వెంటాడతాయి అని అప్సరరాణి చెప్పారు. యాక్షన్‌కి థ్రిల్‌ని మేళవించి తీసిన ఓ మంచి చిత్రమిది అని రంజిత్‌రామ్ పేర్కొన్నారు.