FEFSI: ఫెఫ్సీకి పోటీగా మరో కార్మిక సంఘం!
ABN , Publish Date - Feb 02 , 2025 | 11:55 PM
‘‘తమిళనాడు సినీ నిర్మాణ కార్మికుల సమ్మేళనం’’ పేరుతో కొత్తగా ఒక సంఘాన్ని స్థాపించనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబధిం చిన అధికారిక ప్రకటన పత్రికల్లో విడుదల చేస్తామని, ఈ సంఘంలో చేర దలచిన కార్మికులు ప్రకటనలో పేర్కొనే చిరునామాలో సంప్రదించాలని నిర్మాతల మండలి కోరింది.
తమిళ చిత్రపరిశ్రమలో మరో సినీ నిర్మాణ కార్మికుల సంఘం పురుడు పోసుకోనుంది. ప్రస్తుతం 23 సంఘాలతో కూడిన దక్షిణ భారత సినీ నిర్మాణ కార్మికుల సమ్మేళనం ఫెఫ్సీకి తమిళనాడు సినీ నిర్మాతల మండలికి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. దీంతో గతంలో ఈ రెండు సంఘాల మధ్య అవగాహన ఒప్పందాన్ని రద్దు చేసినట్టు 2024 డిసెంబరు 20వ తేదీన ఫెఫ్సీ అధికారికంగా వెల్లడించింది. అలాగే, గత నెల 27న కూడా ఒప్పంద రద్దు అయినట్టు మరోమారు ప్రకటించింది. ఇది నిర్మాతల మండలికి ఆగ్రహం తెప్పించింది. ఇక నుంచి తమకు అనుకూలంగా ఉండే సినీ నిర్మాణ కార్మికులను ఉపయోగించుకుని సినిమాలు తీసుకోవచ్చని నిర్మాతల మండలి ప్రకటించింది.
Also Read- Thandel: సంధ్య థియేటర్ ఎఫెక్ట్.. ‘తండేల్’ వేడుకకు నో ఎంట్రీ బోర్డ్..
ఇందుకోసం ‘తమిళనాడు సినీ నిర్మాణ కార్మికుల సమ్మేళనం’ పేరుతో కొత్తగా ఒక సంఘాన్ని స్థాపించనున్నట్టు ప్రకటించింది. దీనికి సంబధించిన అధికారిక ప్రకటన పత్రికల్లో విడుదల చేస్తామని, ఈ సంఘంలో చేరదలచిన కార్మికులు ప్రకటనలో పేర్కొనే చిరునామాలో సంప్రదించాలని నిర్మాతల మండలి కోరింది. ఈ ప్రకటనను అనేక మంది నిర్మాతలు స్వాగతించారు. అయితే, ఫెఫ్సీ పెద్దలు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఈ కొత్తగా ఏర్పాటైన సంఘంపై కోలీవుడ్‌లో హాట్ హాట్‌గా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు అసలు ఫెఫ్సీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని కొందరు నిర్మాతలు సైతం వేచి చూస్తున్నారు. మొత్తంగా అయితే కోలీవుడ్‌లో ఇదొక కాంట్రవర్సీగా మారింది.