అలరించే ఎర్రచీర

ABN , Publish Date - Apr 03 , 2025 | 03:32 AM

సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎర్రచీర: ద బిగినింగ్‌’. సుమన్‌ బాబు కీలక పాత్రలో...

సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ మనవరాలు బేబీ సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఎర్రచీర: ద బిగినింగ్‌’. సుమన్‌ బాబు కీలక పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్‌.వి.వి. సుబ్బారెడ్డి, సీహెచ్‌ వెంకటసుమన్‌ నిర్మిస్తున్నారు. రఘుబాబు, కమల్‌కామరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్‌ 25న విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా చిత్రనిర్మాత ఎన్‌.వి.వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం క్లైమాక్స్‌ అద్భుతంగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకుంటుంది’’ అని అన్నారు. ‘‘సినిమాలో గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యం ఉంది. అద్భుతమైన సినిమాటిక్‌ అనుభూతిని అందించే సినిమా ఇది’’ అని దర్శకుడు సుమన్‌బాబు చెప్పారు.

Updated Date - Apr 03 , 2025 | 03:32 AM