Pushpa 2 OTT Release Date: ‘పుష్ప 2’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా.. ఓటీటీ లవర్స్‌ కోసం మరో ట్రీట్?

ABN , Publish Date - Jan 23 , 2025 | 04:30 PM

Pushpa 2 in OTT: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప 2: ది రూల్’ సినిమా ఓటీటీలోకి వచ్చే సమయం ఆసన్నమైంది. జనవరి 17 నుండి థియేటర్లలో రీలోడెడ్ వెర్షన్ ప్రదర్శితమవుతుండగా.. ఓటీటీ లవర్స్ కోసం మేకర్స్ మరో ట్రీట్‌ని రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

Pushpa 2 OTT Release Date: ‘పుష్ప 2’ ఓటీటీలోకి వచ్చేది అప్పుడేనా.. ఓటీటీ లవర్స్‌ కోసం మరో ట్రీట్?
Pushpa 2 The Rule Movie Still

Pushpa 2 OTT Streaming Date: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2: ది రూల్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా సంచలనాలను క్రియేట్ చేసింది.. ఇంకా చేస్తూనే ఉంది. సంక్రాంతి పండుగకు ముందే ఈ సినిమా రూ. 1830 ప్లస్ కోట్ల వసూళ్లను రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతి తర్వాత జనవరి 17 నుండి మరో 20 నిమిషాల ఫుటేజ్‌ని మేకర్స్ యాడ్ చేసి ‘పుష్ప 2 రీలోడెడ్’ పేరుతో థియేటర్స్‌లో ప్రదర్శిస్తుండటంతో.. మళ్లీ కలెక్షన్స్ పుంజుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్‌గా అయితే ఈ సినిమా రూ. 2000 కోట్ల మార్క్‌ను అందుకున్నట్లుగా కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో టాక్ మొదలైంది.


Also Read- Kumbh Mela Monalisa: మహా కుంభమేళా మోనాలిసాకు బంపరాఫర్..


ఇంతకు ముందు ‘పుష్ప 2: ది రూల్’ సినిమా సంక్రాంతి స్పెషల్‌గా ఓటీటీ రిలీజ్ ఉండబోతుందనేలా వచ్చిన వార్తలను మైత్రీ మూవీస్ సంస్థ ఖండించింది. ఆ వార్తలకు బ్రేక్ వేస్తూ.. నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం, సినిమా విడుదలైన 56 రోజుల తర్వాత మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్‌కు వస్తుందని అధికారికంగా ప్రకటించారు. దీంతో సంక్రాంతికి ‘పుష్ప 2’ సినిమా ఓటీటీకి వస్తుందనే వార్తలకు బ్రేక్ పడింది. ఆ వెంటనే రీలోడెడ్ వెర్షన్ అంటూ 20 నిమిషాల అదనపు ఫుటేజ్‌ని యాడ్ చేసి.. థియేటర్స్‌లో ఫ్రెష్‌గా వదిలారు. ఇక మైత్రీవారు చెప్పిన 56 రోజుల గడువు దగ్గరపడుతుండటంతో.. మరోసారి ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి.


Allu-Arjun.jpg

ఆ వార్తలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. జనవరి 30 లేదంటే, 31న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చే అవకాశం ఉంది. దీనిపై మేకర్స్ మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే.. ఓటీటీ లవర్స్ కోసం ‘పుష్ప 2’ నుంచి మరో ట్రీట్ ఉండబోతున్నట్లుగా టాక్ వినబడుతుంది. అదేంటంటే.. ఇప్పటికే ఈ సినిమాకు 20 నిమిషాల ఫుటేజ్‌ని యాడ్ చేయగా.. ఈ యాడ్ చేసిన ఫుటేజ్‌తో పాటు ఓటీటీలో మరో 10 నిమిషాల అదనపు ఫుటేజ్‌ని.. అంటే టోటల్‌గా 30 నిమిషాల అదనపు ఫుటేజ్‌తో ‘పుష్ప 2’ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని అంటున్నారు. మరి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియాలంటే.. ఇటు మేకర్స్‌గానీ, అటు నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యంగానీ వివరణ ఇవ్వాల్సి ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటించగా.. డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల ఓ పాటలో తళుక్కున మెరిసింది.


Also Read- Poonam Kaur: నాకు పాలిటిక్స్ తెలియవు.. ‘మా’ని నేను కోరేది అదొక్కటే..

Also Read- Saif Ali Khan: సైఫ్‌ని హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‪కు రివార్డు.. ఆ రివార్డు ఏమిటంటే..

Also Read- Saif Ali Khan: సైఫ్‌ అలీఖాన్‌ డిశ్చార్జ్.. హాస్పిటల్ బిల్ ఎంత అయిందో తెలుసా?

Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 23 , 2025 | 04:30 PM