Yuvan Shankar Raja: నా విజయానికి కారణం ఆ హీరోనే..

ABN , Publish Date - Oct 27 , 2024 | 06:37 PM

తన విజయానికి కోలీవుడ్‌కి చెందిన అగ్రహీరో కారణమని ప్రముఖ సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆయన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరా హీరో? ఏమా కథ? తెలుసుకుందామా..

Yuvan Shankar Raja

Dheena.jpg

తన విజయానికి అగ్రహీరో అజిత్‌ కుమార్‌ (Ajith Kumar) కారణమని ప్రముఖ సంగీత దర్శకుడు యువన్‌ శంకర్‌ రాజా (Yuvan Shankar Raja) అన్నారు. శరత్‌ కుమార్‌ హీరోగా నటించిన ‘అరవిందన్‌’ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో యువ సంగీత దర్శకుడుగా అరంగేట్రం చేసిన యువన్‌ శంకర్‌ రాజా.. ఈ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆయన సంగీతం అందించిన పలు చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. దీంతో యువన్‌కు నెగెటివ్‌ పేరు వచ్చింది. ఆ సమయంలో హీరో అజిత్‌ తనని నమ్మి ఇచ్చిన అవకాశంతోనే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్పుకొచ్చారు యువన్ శంకర్ రాజా. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలను షేర్ చేసుకున్నారు. అందులో ముఖ్యంగా అజిత్ గురించి ఆయన చెప్పిన విషయాలు సంచలనంగా మారాయి. ఇంతకీ యువన్ ఏమన్నారంటే..

Also Read-Renu Desai: ఉపాసనకు థ్యాంక్స్ చెప్పిన రేణూ దేశాయ్.. ఎందుకో తెలుసా?


‘‘నా మొదటి చిత్రం తర్వాత వరసగా నా సినిమాలు ఫెయిల్ అయ్యాయి. అప్పుడు నాకు అదృష్టం లేదంటూ నిరాశపరిచేలా పలువురు కామెంట్స్‌ చేశారు. ఇండస్ట్రీలోని వారు కూడా నాకు అవకాశాలు ఇవ్వడానికి వెనకడుగు వేశారు. ఆ సమయలో అజిత్‌ సార్ పిలిచి మరి ‘దీనా’ సినిమాకు సంగీతం సమకూర్చాలని, ఈ సినిమాతో ప్రతిభ నిరూపించుకోవాలని సలహా ఇచ్చారు. ‘దీనా’ చిత్రం పాటలు సూపర్‌హిట్‌ అయ్యాయి. ఆ సినిమా కెరీర్‌లో నాకు ఒక కంబ్యాక్‌ మూవీగా నిలిచింది. దీనికి ప్రధాన కారణం అజిత్‌. అందువల్ల నా విజయానికి అజిత్‌ సారే కారణం. ఈ విషయాన్ని ఎప్పటికీ మరిచిపోను’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం యువన్ చేసిన ఈ వ్యాఖ్యలను అజిత్ కుమార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇది మా హీరో గ్రేట్‌నెస్ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.

Also Read-NBK: అన్‌స్టాపబుల్ స్టేజ్‌పై బాలయ్య.. కానీ ఈ లుక్ ఏ సినిమాలోదో కనిపెట్టారా?

Also Read-Star Heroine: ఈ ఫొటోలోని పాప ఇప్పుడొక స్టార్ హీరోయిన్.. ఎవరో కనిపెట్టండి చూద్దాం!

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Oct 27 , 2024 | 06:37 PM