Average Student Nani: ‘కాలేజ్‌లోనే నాని.. ఆ తర్వాత మాత్రం..’

ABN , Publish Date - Jul 27 , 2024 | 08:20 PM

‘మెరిసే మెరిసే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్ కుమార్ కొత్తూరి.. ఇప్పుడు రెండో సినిమాతో దర్శకుడిగానే కాకుండా హీరోగానూ తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న ‘యావరేజ్ స్టూడెంట్ నాని’. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Average Student Nani Teaser Launch Event

‘మెరిసే మెరిసే’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్ కుమార్ కొత్తూరి (Pawan Kumar Kothuri).. ఇప్పుడు రెండో సినిమాతో దర్శకుడిగానే కాకుండా హీరోగానూ తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. ఆయన హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ (Average Student Nani). శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా గ్రాండ్‌గా థియేటర్లో విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్స్‌ని యమా జోరుగా నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read- K Vijaya Bhaskar: మరో ‘నువ్వు నాకు నచ్చావ్’ లాంటి సినిమా ఇది..

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రిలీజైన పోస్టర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలు మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా వదిలిన టీజర్‌ కూడా సినిమాపై అంచనాలను పెంచేదిగా ఉంది. మోస్ట్ రొమాంటిక్‌గా సాగిన ఈ టీజర్‌ యూత్‌ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. (Average Student Nani Teaser Out)


Average-Student-Nani-pic.jpg

టీజర్ విషయానికి వస్తే.. ‘మనం ఆర్డినరీ అయినా మనం ట్రై చేసే అమ్మాయి ఎక్స్‌ట్రార్డినరీగా ఉండాలి’, ‘కాలేజ్‌లో ఉన్నంత వరకే స్టూడెంట్ నాని.. ఆ తరువాత కూకట్ పల్లి నాని’ అంటూ సాగే డైలాగ్స్‌తో యావరేజ్ స్టూడెంట్ నాని మోస్ట్ రొమాంటిక్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్‌గా సాగింది. ఈ టీజర్‌లో యూత్‌కి కావాల్సిన ప్రతీ అంశం ఉంది. రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఇలా అన్ని యాంగిల్స్‌ను టచ్ చేస్తూ టీజర్‌ను కట్ చేశారు. ఈ టీజర్‌లో విజువల్స్, ఆర్ఆర్ అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.

పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ మాల్వియ, సాహిబా భాసిన్, వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి తదితరులు నటించిన ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ, ఉద్ధవ్ ఎస్ బి ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు.

Read Latest Cinema News

Updated Date - Jul 27 , 2024 | 10:06 PM

Average Student Nani: హీరోగా మ‌రో ద‌ర్శ‌కుడు.. ఆకట్టుకుంటోన్న‘యావరేజ్ స్టూడెంట్ నాని’ మోషన్ పోస్టర్

Average Student Nani: ‘ఏమైందో మనసే’ అంటోన్న యావరేజ్ స్టూడెంట్

Average Student Nani: అయ్యబాబోయ్.. ఆ ఫస్ట్ లుక్ ఏంటి?

Average Student Nani: ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ మూవీ టీజర్

Average Student Nani: ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ మూవీలోని ‘సారా సారా’ లిరికల్ సాంగ్