మంచి చిత్రాలతో మీ ముందుకొస్తా: సంపూర్ణేశ్‌ బాబు

ABN , Publish Date - Apr 05 , 2025 | 04:39 AM

సంపూర్ణేశ్‌బాబు 11 సంవత్సరాల తెలుగు సినిమా కెరీర్‌ను గుర్తు చేసుకుంటూ, తనకు లభించిన అవకాశాలపై ఆనందం వ్యక్తం చేశారు. ఆయన హీరోగా నటించిన "సోదరా" చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది, అలాగే మరికొన్ని సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి

‘తెలుగుచిత్ర పరిశ్రమలో నటుడిగా 11 ఏళ్ల కెరీర్‌ నాది. ఎంతోమందికి రాని అవకాశం నాకు లభించినందుకు సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరించడం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను’ అని సంపూర్ణేశ్‌బాబు అన్నారు. ఆయన హీరోగా నటించిన ‘సోదరా’ చిత్రం ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సందర్భంగా సంపూర్ణేశ్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ‘ఒక చిన్న పల్లెటూరి వచ్చిన నరసింహాచారి అనే వ్యక్తి ఈ రోజు సంపూర్ణేశ్‌బాబుగా మీ ముందున్నాడు అంటే దానికి కారణం ‘హృదయ కాలేయం’ చిత్రం. ఇకపై ప్రేక్షకులు మెచ్చే మంచి చిత్రాలు చేయాలనుకుంటున్నాను. త్వరలో ‘సోదరా’ చిత్రంతో మీ ముందుకు వస్తున్నాను. మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి’ అని చెప్పారు.

Updated Date - Apr 05 , 2025 | 04:39 AM