Mahesh Babu: మై పాస్‌పోర్ట్‌ ఈజ్‌ బ్యాక్‌.. మీమ్స్‌ హల్‌చల్‌

ABN , Publish Date - Apr 05 , 2025 | 08:52 PM

మనకు సంబంధించింది ఏదైనా మన దగ్గరే ఉంటే ఆ హ్యాపీనెస్‌ వేరుగా ఉంటుంది. ప్రస్తుతం మహేశ్‌ (Mahesh Babu) ఇలాంటి ఆనందంలోనే ఉన్నారు.


మనకు సంబంధించింది ఏదైనా మన దగ్గరే ఉంటే ఆ హ్యాపీనెస్‌ వేరుగా ఉంటుంది. ప్రస్తుతం మహేశ్‌ (Mahesh Babu) ఇలాంటి ఆనందంలోనే ఉన్నారు. తన పాస్‌పోర్ట్‌ తనకు వచ్చేసిందంటూ ఎయిర్‌పోర్ట్‌లో ఫొటోగ్రాఫర్లకు సరదాగా చూపించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

మహేశ్‌కు టూర్స్‌ వెళ్లడం అంటే పిచ్చి. సమయం దొరికిన ప్రతిసారీ టైమ్‌ వేస్ట్‌ చేయకుండా తన కుటుంబంతో కలిసి విహారానికి వెళ్తుంటారు. ఇప్పుడు ఆయన జక్కన్న (SS rajamouli) సినిమాతో బిజీగా ఉన్నారు. మూడు నెలల క్రితం మహేశ్‌ పాస్‌పోర్ట్‌ తీసుకున్నానంటూ ఓ పోస్ట్‌ పెట్టారు. ఆ రోజు సోషల్‌ మీడియా అంతా ఫన్నీ మీమ్స్‌తో నిండిపోయింది. ఇప్పుడు మహేశ్‌ తన పాస్‌పోర్ట్‌ను చూపుతూ ఓ వీడియోలో కనిపించారు. దీంతో మరోసారి మీమర్స్‌కు పని పడింది.  ‘మై పాస్‌పోర్ట్‌ ఈజ్‌ బ్యాక్‌’, ‘పాస్‌పోర్ట్‌ వచ్చేసింది.. నన్ను ఎవరూ ఆపలేరు’ అంటూ నెట్టింట మహేశ్‌ వెర్షన్‌ మీమ్స్‌  చక్కర్లు కొడుతున్నాయి. దీంతో 'ఎస్‌ఎస్‌ఎంబీ29' (SSMB29) ట్రెండింగ్‌లో ఉంది.  ఈ సినిమా విషయానికొస్తే ఇటీవల ఒడిశాలో ఓ షెడ్యూల్‌ పూర్తయింది. సిమిలిగుడ సమీపంలోని మాలి, పుట్‌సీల్‌, ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. మహేశ్‌తో పాటు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ప్రియాంకా చోప్రా తదితరులు ఈ షూటింగ్‌లో పాల్గొన్నారు.  

Updated Date - Apr 05 , 2025 | 08:52 PM