Average Student Nani: ‘ఏమైందో మనసే’ అంటోన్న యావరేజ్ స్టూడెంట్

ABN , Publish Date - Jul 25 , 2024 | 09:49 PM

‘మెరిసే మెరిసే’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన పవన్ కుమార్ కొత్తూరి.. ఇప్పుడు తన రెండో సినిమా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’తో హీరోగానూ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా విడుదలకు ముస్తాబవుతోన్న ఈ చిత్ర సెకండ్ సింగిల్‌ని తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Average Student Nani Movie Stills

‘మెరిసే మెరిసే’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన పవన్ కుమార్ కొత్తూరి (Pawan Kumar Kothuri).. ఇప్పుడు తన రెండో సినిమా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ (Average Student Nani)తో హీరోగానూ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు ముస్తాబవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏమైందో మనసే’ అనే లిరికల్ సాంగ్‌ (Emaindho Manase Lyrical Song)ని మేకర్స్ విడుదల చేశారు.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను మేకర్స్ జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్, మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ సింగిల్ మంచి స్పందనను రాబట్టుకోగా.. ఇప్పుడు విడుదల చేసిన సెకండ్ సింగిల్ ‘ఏమైందో మనసే’ కూడా శ్రోతలను ఆకట్టుకుంటోంది. పూర్తి రొమాంటిక్ మోడ్‌లో సాగే ఈ మెలోడీ పాటకు కార్తీక్ బి కొడకండ్ల మంచి బాణీని అందించారు. (Average Student Nani Movie)


Nani.jpg

శక్తి శ్రీ గోపాలన్ ఆలపించిన ఈ సాంగ్‌కు కృష్ణవేణి మల్లవజ్జల సాహిత్యం వినగానే అందరినీ రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకెళుతోంది. ఈ పాటలో పవన్, సాహిబా భాసిన్ స్టీమీ కెమిస్ట్రీ కూడా అదిరిపోయిందనే చెప్పాలి. ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ, ఉద్ధవ్ ఎస్ బి ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పవన్ కుమార్ కొత్తూరి, స్నేహ మాల్వియ, సాహిబా భాసిన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో వివియా సంత్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, ఖలేజా గిరి తదితరులు ఇతర తారాగణం.

Updated Date - Jul 25 , 2024 | 09:49 PM

Average Student Nani: అయ్యబాబోయ్.. ఆ ఫస్ట్ లుక్ ఏంటి?

Average Student Nani: హీరోగా మ‌రో ద‌ర్శ‌కుడు.. ఆకట్టుకుంటోన్న‘యావరేజ్ స్టూడెంట్ నాని’ మోషన్ పోస్టర్

Average Student Nani: ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ మూవీలోని ‘సారా సారా’ లిరికల్ సాంగ్

Average Student Nani: ‘సారా సారా’.. ఆకట్టుకుంటోన్న హార్ట్ టచింగ్ సాంగ్