Average Student Nani: ‘సారా సారా’.. ఆకట్టుకుంటోన్న హార్ట్ టచింగ్ సాంగ్

ABN , Publish Date - Jul 19 , 2024 | 08:14 PM

‘యావరేజ్ స్టూడెంట్ నాని’ అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘సారా సారా’ అంటూ సాగే హార్ట్ టచింగ్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Average Student Nani Movie Still

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీని ఓటీటీలు ఏలుతున్నాయి. ఆ భాష, ఈ భాష అని లేకుండా అన్ని భాషల సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉండటంతో.. ఇప్పుడు మేకర్స్ కొత్త కథలు, కాన్సెప్టుల మీద ఫోకస్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే దర్శకులు హీరోలుగా.. హీరోలు దర్శకరచయితలుగా మారుతున్నారు. విషయంలోకి వస్తే.. ‘మెరిసే మెరిసే’ చిత్రంతో పవన్ కుమార్ కొత్తూరి (Pawan Kumar Kothuri) దర్శకుడిగా పరిచయం కాగా, ఇప్పుడు దర్శకత్వంతో పాటు హీరోగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ (Average Student Nani) అనే చిత్రంతో హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగానూ పవన్ కుమార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘సారా సారా’ (Saara Saara Melody Song) అంటూ సాగే హార్ట్ టచింగ్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Also Read-Suman: ఏపీలో సినిమా ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే.. ఆ కండీషన్లు పెట్టకూడదు

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే వచ్చిన కాన్సెప్ట్ పోస్టర్, మోషన్ పోస్టర్.. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇలా అన్నీ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ ‘సారా సారా’ సాంగ్‌ని వదిలారు మేకర్స్. ప్రస్తుతం కురుస్తోన్న వర్షాలకు బయట ఉన్న కూల్ వెదర్‌కు తగ్గట్టుగా.. మనసుకు హత్తుకునేలా, హాయినిచ్చేలా ఉన్న ఈ మెలోడీ పాటను శివకృష్ణచారి ఎర్రోజు రచించగా.. పద్మలత, అనుదీప్ దేవ్ ఆలపించారు. కార్తిక్ బి కొడకండ్ల ఇచ్చిన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. (Average Student Nani Movie Song Saara Saara)


saara-saara.jpg

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో స్నేహా మాలవ్య, సాహిబా భాసిన్‌, వివియా సంత్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సజీష్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ, కార్తీక్ బి కొడకండ్ల సంగీతం అందించారు. ఉద్ధవ్ ఎస్ బి ఈ చిత్రానికి ఎడిటర్‌గా పని చేశారు. ప్రస్తుతం ఈ ‘సారా సారా’ టాప్‌లో ట్రెండ్ అవుతూ శ్రోతలని అలరిస్తోంది.

Read Latest Cinema News

Updated Date - Jul 19 , 2024 | 08:14 PM