Average Student Nani: ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ మూవీ టీజర్

ABN, Publish Date - Jul 26 , 2024 | 09:04 PM

‘మెరిసే మెరిసే’ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన పవన్ కుమార్ కొత్తూరి.. తన రెండో సినిమా ‘యావరేజ్ స్టూడెంట్ నాని’తో హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. శ్రీ నీలకంఠ మహదేవ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై పవన్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఆగస్ట్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jul 26 , 2024 | 09:05 PM