Tamannaah Bhatia: తమన్నాను ఏడిపించిన విషయం ఏంటో తెలుసా..
ABN , Publish Date - Apr 05 , 2025 | 08:47 PM
నటిగా మిల్కీబ్యూటీ తమన్నా ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లు అవుతోంది. దక్షిణాదితోపాటు ఉత్తరాదిలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అగ్ర హీరోలందరితో నటించింది.
నటిగా మిల్కీబ్యూటీ తమన్నా (Tamannaah Bhatia) ఇండస్ట్రీలో అడుగుపెట్టి 20 ఏళ్లు అవుతోంది. దక్షిణాదితోపాటు ఉత్తరాదిలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అగ్ర హీరోలందరితో నటించింది. తాజాగా ఆమె కీలక పాత్రలో నటించిన చిత్రం ‘ఓదెల 2’ (Odela 2 రిలీజ్‌కు సిద్థమైంది. ప్రస్తుతం ఆమె ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కెరీర్‌పె కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పదో తరగతిలో ఉన్నప్పుడే నేను ఇండస్ర్టీలోకి వచ్చా. చదువుల్లో టీచర్లు నాకెంతో సాయం హెల్ప్ చేసేవారు. ఒక్కొస?రి వాళ్లే నా అసైన్‌మెంట్స్ పూర్తి చేేసవారు. వారికి ఎప్పుడూ కృతజ్ఞురాలినే. నిజ జీవితంలో నేను కాలేజీకి వెళ్లలేదు. కానీ, రీల్ లైఫ్‌లో మాత్రం కాలేజీ స్టూడెంట్‌గా నటించా. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అప్పుడే 20 ఏళ్లు అవుతోంది. అందుకు ఎంతో ఆనందంగా ఉంది. కెరీర్ ఆరంభించినప్పుడు పరిశ్రమలో ఇన్నేళ్లు ఉంటానని అనుకోలేదు. ఇన్నేళ్ల జర్నీలో నా 21వ పుట్టినరోజు నాడు జరిగిన ఒక సంఘటన ఏమాత్రం మర్చిపోలేను. పుట్టినరోజు సందర్భంగా షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని ఇంట్లోనే ఉన్నా. అప్పుడు నాపై పత్రికల్లో ఒక ప్రత్యేక కథనం వచ్చింది. ‘తమిళంలో నంబర్ 1 నటి’ అనేది అందులోని సారాంశం. అది చదువుతూ నేను కన్నీళ్లు పెట్టేసుకున్నా. త్వరగా ఆ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. నంబర్ 1 స్థానానికి వెళ్లాక.. అక్కడే కొనసాగడం అంత సులభం కాదనిపించింది. అదొక బాధ్యతగా తీసుకున్నా. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు చేస్తూ, మెప్పిస్తూ ఈ స్థాయికి చేరుకున్నా’’ అని అన్నారు.
‘ఓదెల 2’ చిత్రానికి అశోక్‌తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తమన్నా శివశక్తిగా కనిపించనున్నారు. సంపత్ నంది టీమ్ వర్క్స్‌తో కలిసి మధుని క్రియేషన్స్ పతాకంపై డి. మధు నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం విడుదల కానుంది.