Manchu Manoj: నాలుగు హృదయాలు.. నాలుగు ఆత్మలు
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:03 AM
మంచు మనోజ్, మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ దంపతుల ముద్దుల కుమార్తె దేవసేన తొలి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.
మంచు మనోజ్ (Manchu Manoj) , మౌనిక (Mounika) ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. ఈ దంపతుల ముద్దుల కుమార్తె దేవసేన (Devsena) తొలి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. జైపూర్ వేదికగా జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను మంచు మనోజ్ ఇటీవల పంచుకున్నారు. తాజాగా మరో స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దేవసేన పుట్టినరోజును పురస్కరించుకుని ఏప్రిల్ 2న మనోజ్ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ‘‘ఏడాది కిందట మా ప్రపంచం మరింత అద్భుతంగా మారింది. ముగ్గురిగా ఉన్న మేము నలుగురం అయ్యాం. నాలుగు హృదయాలు. నాలుగు ఆత్మలు. విడదీయలేని బంధమయ్యాయి. ఈ నాలుగు స్తంభాలు ప్రేమ, బలంతో నిర్మించిన కుటుంబం. మా ఎంఎం పులి.. దేవసేన శోభ. నువ్వు మా జీవితాల్లో వెలుగు, ధైర్యంతో పాటు గొప్ప ఆనందాన్ని తెచ్చావు. అమ్మా, నేనూ, ధైరవ్ అన్నా నీకు ఎప్పటికీ రక్షణగా ఉంటాం. నీకు మొదటి జన్మదిన శుభాకాంక్షలు. మాటల్లో కంటే నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాం’’ అంటూ కుమార్తెపై ప్రేమను తెలిపారు.