Eleven Movie: మేలో లెవెన్
ABN , Publish Date - Apr 05 , 2025 | 04:34 AM
నవీన్‌చంద్ర కథానాయకుడిగా నటించిన మర్డర్ మిస్టరీ చిత్రం ‘లెవెన్’ మే 16న విడుదల కానుంది. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. నవీన్‌చంద్ర పోలీసాఫీసర్‌గా కనిపించనున్న ఈ చిత్రంలో రేయాహరి జోడీగా నటించారు
నవీన్‌చంద్ర కథానాయకుడిగా మర్డర్ మిస్టరీ కథాంశంతో రూపుదిద్దుకున్న చిత్రం ‘లెవెన్’. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వంలో అజ్మల్ ఖాన్, రే యా హరి నిర్మించారు. ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. మే 16న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం శుక్రవారం ప్రకటించింది. ఈ సందర్భంగా పోలీసాఫీసర్ పాత్రలో ఉన్న నవీన్‌చంద్ర లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. నవీన్‌చంద్రకు జోడీగా రేయాహరి నటించారు. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫీ: కార్తీక్ అశోకన్.