Adhik Weds Aishwarya: అంగరంగ వైభవంగా అధిక్, ఐశ్వర్యల వివాహం.. ఫొటోలు వైరల్

ABN , First Publish Date - 2023-12-15T16:46:55+05:30 IST

నడిగర్‌ తిలగం దివంగత శివాజీ గణేశన్‌ రెండో కుమారుడు, సినీ నటుడు ప్రభు కుమార్తె ఐశ్వర్య వివాహం.. శుక్రవారం కోలీవుడ్‌ దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌తో ఘనంగా జరిగింది. ఐశ్వర్య, అధిక్ రవిచంద్రన్ ఎప్పటి నుండో ప్రేమలో ఉన్నారు. వారి ప్రేమని పెద్దలు అంగీకరించడంతో.. వారి వివాహం చెన్నైలోని ఓ ఫంక్షన్ హా‌ల్‌లో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిపారు.

Adhik Weds Aishwarya: అంగరంగ వైభవంగా అధిక్, ఐశ్వర్యల వివాహం.. ఫొటోలు వైరల్
Director Adhik Ravichandran and Aishwarya Marriage Event

నడిగర్‌ తిలగం దివంగత శివాజీ గణేశన్‌ (Sivaji Ganesan) రెండో కుమారుడు, సినీ నటుడు ప్రభు (Prabhu) కుమార్తె ఐశ్వర్య (Aishwarya) వివాహం.. శుక్రవారం కోలీవుడ్‌ దర్శకుడు అధిక్‌ రవిచంద్రన్‌ (Adhik Ravichandran)తో ఘనంగా జరిగింది. ఐశ్వర్య, అధిక్ రవిచంద్రన్ ఎప్పటి నుండో ప్రేమలో ఉన్నారు. వారి ప్రేమని పెద్దలు అంగీకరించడంతో.. వారి వివాహం చెన్నైలోని ఓ ఫంక్షన్ హా‌ల్‌లో శుక్రవారం అంగరంగ వైభవంగా జరిపారు. ఈ వివాహానికి కోలీవుడ్‌ నుండి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.

వివాహానికి ముందు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ (Stalin), ఆయన సతీమణి దుర్గా స్టాలిన్‌లను ప్రభు - పునిత దంపతులు ఆహ్వానించారు. వారికి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఆ సమయంలో సినీ హీరో, ప్రభు కుమారుడు విక్రమ్‌ ప్రభు (Vikram Prabhu) కూడా ఉన్నారు. సీఎంను వారు ఆహ్వానిస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ పెళ్లికి హాజరైన విశాల్ (Vishal).. సోషల్ మీడియా వేదికగా.. ‘‘మై డార్లింగ్‌ అధిక్‌ రవిచంద్రన్‌, నా సోదరి ఐశ్వర్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న మీకు.. ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అధిక్‌.. నా సోదరిని ఒక రాణిలా చూసుకో. యాధృచ్చికం ఏమిటంటే నా సోదరి పేరు కూడా ఐశ్వర్యనే కావడం. మీ జంటను ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను’’ అని ఆయన రాసుకొచ్చారు.


saravanan.jpg

కాగా, విశాల్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన ‘మార్క్ ఆంటోని’ (Mark Antony) చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో ఎస్‌జె సూర్య ఓ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా థియేటర్లలో ఉన్న సమయంలోనే అధిక్, ఐశ్వర్యల వివాహం కన్ఫర్మ్ అయింది. ప్రస్తుతం అధిక్, ఐశ్వర్యల పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపు.. ‘మీ జీవితం ఆనందంగా ముందుకు సాగాలి’ అని ఆశీర్వదిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Naga Vamsi: ‘ఓ మై బేబీ’ పాట ట్రోలింగ్‌పై మంకీలతో పోల్చుతూ.. మళ్లీ వివరణ

*********************************

*Guntur Kaaram: అడ్డడ్డే.. ‘ఓ మై బేబీ’ ఎంత పని చేసింది.. ట్విట్టర్ నుండి రామ్‌జో అవుట్!

***********************************

*Bunny Vas: జనసేన పార్టీలో నిర్మాత బన్నీ వాస్‌కు కీలక బాధ్యత

**************************************

Updated Date - 2023-12-15T16:46:56+05:30 IST