Sivarapalli Web Series Review: ‘సివరపల్లి’ వెబ్ సిరీస్ రివ్యూ

ABN , Publish Date - Jan 24 , 2025 | 05:48 PM

రాగ్ మయూర్, రూప లక్ష్మి, మురళీధర్ గౌడ్, సన్నీ పల్లె, ఉదయ్‌ గుర్రాల, పావని కరణం ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘సివరపల్లి’. భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. జనవరి 24న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‌‌కి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే..

Sivarapalli Web Series Review: ‘సివరపల్లి’ వెబ్ సిరీస్ రివ్యూ
Sivarapalli Web Series Poster

వెబ్ సిరీస్: ‘సివరపల్లి’

OTT: అమెజాన్ ప్రైమ్

దర్శకత్వం: భాస్కర్ మౌర్య

‘సివరపల్లి’ తెలుగు వెబ్ సిరీస్​.. హిందీలో హిట్ అయిన పంచాయత్‌‌కు రీమేక్​గా తెలుగులో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌కు భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు. రాగ్ మయూర్, రూప లక్ష్మి, మురళీధర్ గౌడ్, సన్నీ పల్లె, ఉదయ్‌ గుర్రాల, పావని కరణం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్‌సిరీస్‌ మొదటి సీజన్‌ ఎనిమిది ఎపిసోడ్‌లతో జనవరి 24 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సిరీస్ ఎలా ఉందంటే..


Also Read- Gandhi Tatha Chettu Review: సుకుమార్‌ కుమార్తె నటించిన సినిమా ఎలా ఉందంటే

శ్యామ్‌ (రాగ్‌ మయూర్‌) ఇంజినీరింగ్‌ పూర్తి చేసి తన కెరీర్​ను బిల్డ్​ చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో తెలంగాణలో మారుమూల గ్రామమైన సివరపల్లి గ్రామ పంచాయితీ కార్యాలయ కార్యదర్శిగా నియమించబడతాడు. ఈ ఉద్యోగం ఇష్టం లేకున్నా తన స్నేహితుడి సలహా మేరకు సివరపల్లిలో ఉద్యోగం చేసేందుకు వెళ్తాడు. నిజాయితీగా పని చేయాలనుకున్న శ్యామ్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.. వాటిని ఎలా అధిగమించాడు? అనేదే ఈ వెబ్‌ సిరీస్‌ కథ.


Also Read- Hathya Review : వివేకా మర్దర్‌ ఇతివృత్తంతో రూపొందిన హత్య సినిమా ఎలా ఉందంటే..


సివరపల్లి సిరీస్ చిన్న మలుపులతో ఒరిజినల్ వెర్షన్ అయిన పంచాయత్‌ తరహాలోనే ఫ్రేమ్‌ టు ఫ్రేమ్‌ రీమేక్ చేయబడింది. లీడ్ రోల్స్‌లో నటించిన రాగ మయూర్, మురళీధర్ గౌడ్, రూపా లక్ష్మీ నటన ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. ‘వాస్తవికత తక్కువ, డ్రామా ఎక్కువ’గా ఉండటం వల్ల సిరీస్ పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా అనిపించదు.


అయితే బాలిక విద్య, మూఢనమ్మకాలు, లింగ అసమానతలు, వ్యవస్థలోని అవినీతి మరియు గ్రామాల్లో పేదరికం ఇలా అనేక అంశాలను కథనంలో టచ్ చేశారు‌. ఒరిజినల్ వెర్షన్ ‘పంచాయత్’ చూసిన వారికి ‘సివరపల్లి’ అంతగా ఆకట్టుకోక పోవచ్చు కానీ.. ఎలాంటి అసభ్యత, అశ్లీలత లేకుండా క్లీన్‌గా రూపొందిన కారణంగా, పంచాయత్‌ను చూడని వారు ‘సివరపల్లి’ వెబ్ సిరీస్‌ను ఓసారి చూడవచ్చు.


Also Read-IT Raids on Tollywood: ఐటీ నెక్స్ట్ టార్గెట్ అల్లు అరవిందేనా?

Also Read-Sachin Daughter Sara: నా సీక్రెట్స్‌ అన్నీ వాడికి తెలుసు.. వాడే నా ప్రాణం

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 24 , 2025 | 05:48 PM