Prabhas Marriage: ప్రభాస్‌ పెళ్లిపై పెద్దమ్మ స్పందన!

ABN , Publish Date - Jul 07 , 2024 | 02:33 PM

టాలీవుడ్‌ హీరోల్లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు డార్లింగ్‌ ప్రభాస్‌. ఆయన పెళ్లి కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు.

Prabhas Marriage:  ప్రభాస్‌ పెళ్లిపై పెద్దమ్మ స్పందన!

టాలీవుడ్‌ హీరోల్లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు డార్లింగ్‌ ప్రభాస్‌(Prabhas). ఆయన పెళ్లి కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఫలానా అమ్మాయిని చేసుకోబోతున్నారంటూ, ఫలానా హీరోయిన్‌తో ఏడడుగులు, బంధువుల్లోనే ఒక అమ్మాయి ఉందని చాలాకాలంగా టాక్‌ నడుస్తోంది. మరోవైపు, ప్రభాస్‌కు పెళ్లికాదంటూ జ్యోతిష్యులు చెప్పడం నెట్టింట చర్చకు దారి తీసింది. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో హోస్ట్‌ ఇదే విషయాన్ని ప్రస్తావించగా ప్రభాస్‌ పెద్దమ్మ శ్యామలా (Syamala Devi) దేవి స్పందించారు.  


‘‘మంచితనం మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో కల్కి సక్సెస్‌ విషయంలో రుజువైంది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు  విజయం కష్టమని కొందరు చెప్పారు. కానీ, వారి అంచనాలు తారుమారు అయ్యాయి. ప్రభాస్‌ పెళ్లి విషయంలోనూ అంతే. కోట్లాది అభిమానులు ఆశించినట్టుగా తన సినిమాలు ఉండేందుకు ప్రభాస్‌ ఎంతగానో శ్రమిస్తున్నాడు. బాధ్యతగా తీసుకుని దృష్టి మరలకుండా అలా చేస్తున్న ఆయన గొప్ప వ్యక్తి. మా అబ్బాయికి పెళ్లి చేయాలని మాకూ ఉంటుంది. కానీ, సమయం రావాలి. ఆ నమ్మకంతోనే ఉన్నాం. అన్ని విషయాలు పైనుంచి కృష్ణంరాజు చూసుకుంటారు. ఇప్పటి వరకూ ఆయన ఆశించినవన్నీ జరిగాయి. మ్యారేజ్‌ కూడా జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన దర్శకత్వం వహించిన 'కల్కి 2898 ఎడీ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా ఆడుతోంది. 

Updated Date - Jul 07 , 2024 | 06:14 PM