Kalyan Ram: 'అర్జున్ S/O వైజయంతి' విడుదల ఎప్పుడంటే.. 

ABN , Publish Date - Apr 03 , 2025 | 09:10 PM

'అర్జున్ S/O వైజయంతి' ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో కళ్యాణ్ రామ్ ను ఇంతకు ముందెన్నడూ చూడని మాస్, యాక్షన్  అవతార్ లో కనిపిస్తున్నారు.


నందమూరి కళ్యాణ్ (Kalyan ram)రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా 'అర్జున్ S/O వైజయంతి' (Arjun Son Of Vyjayanthi)ప్రదీప్ చిలుకూరి (Pradeep Chilukuri) దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.  ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో కళ్యాణ్ రామ్ ను ఇంతకు ముందెన్నడూ చూడని మాస్, యాక్షన్  అవతార్ లో కనిపిస్తున్నారు.

తన ఇంటెన్స్ ప్రజెన్స్  సినిమాలోని క్యారెక్టర్ పవర్ ఫుల్ వ్యక్తిత్వాన్ని ప్రజెంట్ చేస్తోంది. ఈ మూవీ వండర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుందని నమ్మకం వ్యక్తం చేస్తుంది చిత్ర బృందం. కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారు. సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రానికి బి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ తమ్మిరాజు, స్క్రీన్‌ప్లే శ్రీకాంత్ విస్సా.

Updated Date - Apr 03 , 2025 | 09:10 PM