Ram Charan - Upasana: నీకెప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:02 PM
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజు ఈ వేడుకను ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్ దంపతులు ప్రత్యేక బహుమతి ఇచ్చారు
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ పుట్టినరోజు ఈ వేడుకను ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్ దంపతులు హనుమాన్ చాలీసా పుస్తకాన్ని, హనుమంతుడి ప్రతిమను గిఫ్ట్‌గా పంపారు. ‘నా మనసులో నీకెప్పుడూ ప్రత్యేకమైన స్థ్థానం ఉంటుంది. ఆ హనుమంతుడి ఆశీస్సులు నీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను’ అని రాసి ఉన్న నోట్, శ్రీరాముని పాదుకలు కూడా పంపారు. ఆ ఫొటోలను బుచ్చిబాబు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్, ఉపాసనను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా ‘పెద్ది’ చిత్రం సినిమా తెరకెక్కుతోంది. జాన్వీకపూర్ కథానాయిక. ఇటీవలే ఈ సినిమా హీరో ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా అది చక్కని ఆదరణను సొంతం చేసుకుంది. క్రీడా నేపథ్యంలో ఓ గ్రామీణ కథగా ఈ చిత్రం రూపొందుతున్నట్టు తెలుస్తోంది. గుర్తింపు కోసమే పెద్ది పోరాటం చేస్తాడని రామ్‌చరణ్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.