SSMB29: రాజమౌళి తన రూట్ మార్చారు...
ABN , Publish Date - Apr 03 , 2025 | 09:47 PM
సినిమా ఇండస్ట్రీ ట్రెండ్ మీద నడుస్తుంటుంది. ఒకరు ఒక దార్లో వెళ్లి సక్సెస్ కొడితే మిగతా వారు కూడా ఆ జానర్, లేదా ఆ దార్లో వెళ్లాలని చూస్తుంటారు.
సినిమా ఇండస్ట్రీ ట్రెండ్ మీద నడుస్తుంటుంది. ఒకరు ఒక దార్లో వెళ్లి సక్సెస్ కొడితే మిగతా వారు కూడా ఆ జానర్, లేదా ఆ దార్లో వెళ్లాలని చూస్తుంటారు. ఉదాహరణకు పాన్ ఇండియా సినిమాను తీసుకుంటే ‘బాహుబలి’తో పాన్ ఇండియా సినిమా అంటే ప్రేక్షకులకు చూపించారు రాజమౌళి. అలాగే సినిమాను రెండు బాగాలుగా విడుదల చేసే ట్రెండ్‌ను తీసుకొచ్చారు. అయితే ఆయన విషయంలో అది సక్సెస్ అయింది. ఇప్పుడు కొందరు ఒక పార్ట్‌లో చెప్పాల్సిన సినిమాను రెండు పార్టులుగా సాగదీసి విడుదల చేస్తున్నారు. అదంతా బిజినెస్ కోసమే అని టాక్ కూడా ఉంది. దాని ప్రేక్షకులకు సినిమా మీద ఆసక్తి పోతుందన్నది వాస్తవం. అయితే తాను క్రియేట్ చేసిన ట్రెండ్‌ను తానే బ్రేక్ చేయాలనుకుంటున్నారట రాజమౌళి (SS Rajamouli)
ప్రస్తుతం ఆయన మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా ‘ఎస్‌ఎస్‌ఎంబీ 29’ (SSMB29) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీనిని రెండు భాగాలుగా రానుందని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఒకే భాగంగా తెరకెక్కిస్తున్నానని తెలిసింది. ‘ఆర్‌ఆర్‌ఆర్’లాగే నిడివి ఎక్కువైనా ఈ కొత్త చిత్రాన్నీ ఒకే పార్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రాజమౌళి నిర్ణయించినట్టు తెలిసింది. చెప్పాలనుకున్న కథను సూటిగా సుత్తిలేకుండా చెప్పబోతున్నారని టాక్. ఎప్పటిలాగే.. ఆసక్తికర ఇంట్రడక్షన్, ఉత్కంఠభరిత ఇంటర్వెల్, అదరగొట్టే క్లైమాక్స్‌తో ఈ కథను చెప్పనున్నారు. స్పెషల్ వీడియోతో త్వరలోనే ప్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారని సమాచారం.