Upasana Konidela: ఆడపడుచుకు మెగా కోడలు అరుదైన కానుక...!
ABN , Publish Date - Apr 04 , 2025 | 07:40 AM
సెలబ్రిటీలు అకేషన్స్‌కు వెళ్లినప్పుడు ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడం కామన్. అయితే తీసుకున్నవారికి అన్ని గిఫ్ట్‌లు (Surprise gift)గుర్తుండవు. విలువలు, సంప్రదాయాలను ప్రతిబింబించేవి లేదా అరుదైన కానుకలు ఇచ్చినప్పుడే అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి.
సెలబ్రిటీలు అకేషన్స్‌కు వెళ్లినప్పుడు ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడం కామన్. అయితే తీసుకున్నవారికి అన్ని గిఫ్ట్‌లు (Surprise gift)గుర్తుండవు. విలువలు, సంప్రదాయాలను ప్రతిబింబించేవి లేదా అరుదైన కానుకలు ఇచ్చినప్పుడే అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మెగా కోడలు ఉపాసన కామినేని సుస్మిత కొణిదెలకు ఇచ్చిన అలాంటి బహుమతి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తాజాగా సుస్మిత కొణిదెలకు శ్రీరామ పాదాలు పుస్తకాన్ని గిఫ్ట్‌గా ఇచ్చి కూల్ మూమెంట్‌ను క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని 9Sushmitha)సుస్మిత సోషల్ మీడియాలో పంచుకుని.. చరణ్-ఉపాసనకు (Upasana) థ్యాంక్స్ చెప్పింది. గిఫ్ట్ మీ గురించి చాలా చెబుతోంది అంటూ పోస్ట్ చేసింది.
రామ్ చరణ్ (Ram Charan) 40వ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని ఉపాసన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా హోస్ట్ చేసింది. ఈ ఎపిక్ ఈవెంట్‌లోనే సుస్మితకు ఈ అరుదైన గిఫ్ట్ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మధ్య జరిగిన ఈ పార్టీ ఫుల్ లైవ్‌లీగా సాగింది. అయితే అన్నింటికంటే ఈ గిఫ్ట్ సీన్ అందరి దృష్టినీ ఆకర్షించింది. హై-ప్రొఫైల్ సెలబ్రెటీల మధ్య రెగ్యులర్ లగ్జరీ గిఫ్ట్‌లు కాకుండా, ఆధ్యాత్మిక టచ్‌తో పర్సనల్ వైబ్ ఇచ్చే ఈ బహుమతి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఉపాసన సింపుల్‌గా ఇచ్చిన ఈ గిఫ్ట్, విలువల పరంగా టాప్-నాచ్ అని అంతా ఫీల్ అవుతున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. మెగా పవర్ స్టార్ బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. దీని మ్యూజిక్ రైట్స్‌ను టి-సిరీస్ 25 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దీంతో ఈ విషయం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఇక సుస్మిత కూడా నిర్మాతగా పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. మొత్తానికి ఆడపడుచుకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మెగా కొడలును మెగా ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. దటీజ్ చరణ్ వైఫ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.