Jr Ntr: జపాన్‌లో తారక్ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్..
ABN , Publish Date - Mar 22 , 2025 | 01:52 PM
‘దేవర’ జపాన్ ఆడియన్స్ ముందకెళ్లునుంది. కొన్ని రోజుల క్రితం అక్కడ వేసిన ప్రీమియర్స్‌కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిందని ఫాన్స్ పండగ చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ విడుదల దగ్గరపడుతున్న నేపథ్యంలో ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఎన్టీఆర్(Ntr), జాన్వీ కపూర్ (Jnahvi kapoor) జంటగా దర్శకుడు కొరటాల శివ (Koratala siva) తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దేవర’. ఇప్పుడీ చిత్రం జపాన్ ఆడియన్స్ ముందకెళ్లునుంది. కొన్ని రోజుల క్రితం అక్కడ వేసిన ప్రీమియర్స్‌కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిందని ఫాన్స్ పండగ చేసుకున్నారు. ఇప్పుడు అక్కడ విడుదల దగ్గరపడుతున్న నేపథ్యంలో ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. జపాన్‌లో ఎన్టీఆర్‌కి మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే! అయితే తన లేడీ ఫాలోయర్స్ (Ntr's Lady Fans) వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అక్కడి మహిళలు కొందరు ఎన్టీఆర్ కటౌట్ పెట్టి దానికి పూజ చేస్తున్నారు. ఈ క్రేజీ వీడియో సోషల్ మీడియాలో షేర్ కావడంతో విపరీతంగా వైరల్ అయింది. ఈ నెల 28న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
దేవరకు (Devara) కొనసాగింపుగా పార్ట్-2 కూడా రాబోతుంది. ప్రస్తుతం కొరటాల శివ ఆ కథ పనుల్లో ఉన్నారు. తారక్ ప్రస్తుతం వార్-2, ప్రశాంత్ నీల్ డ్రాగన్‌తో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత దేవర-2 సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.