‘కన్నా.. నీ ప్రేమ సంద్రమే’
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:02 AM
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా విశ్వకరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దిల్‌రూబా’. రుక్సర్ థిల్లాన్ కథానాయిక....

కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా విశ్వకరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దిల్‌రూబా’. రుక్సర్ థిల్లాన్ కథానాయిక. రవి, జోజో జోస్, రాకేశ్ రెడ్డి, సారెగమ నిర్మిస్తున్నారు. ఈ నెల 14న హోలీ సందర్భంగా సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు రెస్పాన్స్ వచ్చింది. తాజాగా, ఈ చిత్రం నుంచి మూడో పాటను విడుదల చేశారు మేకర్స్. ‘కన్నా.. నీ ప్రేమ సంద్రమే. నేను నీ తీరమే. కన్నా.. నువ్వు నా ప్రాణమే, నేను నీ దేహమే’ అంటూ సాగే ఈ గీతాన్ని భాస్కరభట్ల రవికుమార్, విశ్వకరుణ్ రచించారు.
మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి