Karthik Subbaraj: ట్రెండింగ్ లో సూర్య రెట్రో థర్డ్ సాంగ్...
ABN , Publish Date - Apr 13 , 2025 | 03:41 PM
సూర్య, కార్తీక్ సుబ్బరాజు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'రెట్రో'. ఈ యాక్షన్ మూవీలో పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి థర్డ్ సింగిల్ రిలీజ్ అయ్యింది.
తమిళ స్టార్ హీరో సూర్య (Suriya), పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటిస్తున్న సినిమా 'రెట్రో' (Retro). ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు (Karthik Subbaraj) కు చెందిన స్టోన్ బెచ్ ఫిలిమ్స్, సూర్య ఓన్ ప్రొడక్షన్ హౌస్ 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మే 1న ఈ చిత్రం జనం ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని మూడవ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. 'ది వన్' అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోను భిన్నంగా రూపొందించారు. దాంతో ఇది పినీ ప్రియులను బాగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్ లో నిలిచింది. ఈ పాటను సిద్ శ్రీరామ్ తో పాటు సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ (Santhosh Narayan) ఆలపించాడు. సరైన విజయాలు లేక అల్లల్లాడుతున్న సూర్య కు కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న 'రెట్రో' ఎలాంటి సక్సెస్ ను అందిస్తుందో చూడాలి.
Also Read: Balakrishna : బోయపాటితో చెడిందా!?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి