Vidya Balan: నాకు సంబంధం లేదు.. కాస్త అప్రమత్తంగా ఉండండి

ABN , Publish Date - Mar 02 , 2025 | 05:11 PM

బాలీవుడ్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌కు (Vidya Balan) సంబంధించిన సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోన్న వీడియోలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.

Vidya Balan: నాకు సంబంధం లేదు.. కాస్త అప్రమత్తంగా ఉండండి

బాలీవుడ్‌ హీరోయిన్‌ విద్యాబాలన్‌కు (Vidya Balan) సంబంధించిన సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోన్న వీడియోలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎలర్ట్‌ మెసేజ్‌ వదిలారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆ వీడియోలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అవన్నీ ఏఐ టెక్నాలజీతో (AI Technology) క్రియేట్‌ చేసిన డీప్‌ ఫేక్‌ వీడియోలని నెటిజన్లు అప్రమత్తగా ఉండాలని తెలిపారు.


‘‘సోషల్‌మీడియా(Vidya Balan Social media), వాట్సాప్‌ గ్రూపుల్లో ఈ మధ్యకాలంలో నాకు సంబంధించిన పలు వీడియోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే, అవన్నీ ఏఐ జనరేటెడ్‌వి. వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ వీడియోలను సృష్టించడం, వైరల్‌ చేయడంలో నా ప్రమేయం లేదు. అందులోని కంటెంట్‌ను కూడా నేను ఏమాత్రం అంగీకరించను. కాబట్టి, సోషల్‌ మీడియాలో వీడియోలు షేర్‌ చేసే ముందు దయచేసి వాటి గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి. ఏఐ జనరేటెడ్‌ కంటెంట్‌ మిమ్మల్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి’’ అని విద్యా బాలన్‌ పేర్కొన్నారు. డీప్‌ ఫేక్‌ టెక్నాలజీ వల్ల ఇప్పటికే ఎంతోమంది నటీమణులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రష్మిక, దీపికా పదుకొణె, కత్రినా కేౖఫ్‌, అలియా వంటి స్టార్స్‌ ఈ తరహాలో ఇబ్బంది పడ్డవారే.

Updated Date - Mar 02 , 2025 | 05:15 PM