మాస్‌ ప్రేక్షకులకు విందు భోజనంలా...

ABN , Publish Date - Apr 04 , 2025 | 02:41 AM

నందమూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా ప్రదీప్‌ చిలుకూరి తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లపై అశోక్‌ వర్ధన్‌ ముప్పా...

నందమూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా ప్రదీప్‌ చిలుకూరి తెరకెక్కించిన చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. అశోక క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్లపై అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మించారు. విజయశాంతి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచగా, తాజాగా, ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసి ఓ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్‌. ఈ నెల 18న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు ప్రకటించారు. కల్యాణ్‌రామ్‌, విజయశాంతి నటన.. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే ప్రధానాకర్షణగా నిలుస్తాయని మేకర్స్‌ అన్నారు. మాస్‌ ప్రేక్షకులకు విందుభోజనంలా ఉంటూనే కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే భావోద్వేగాలు ఉన్న చిత్రమిదని తెలిపారు. ఈ చిత్రానికి ఎడిటర్‌: తమ్మిరాజు, డీఓపీ: రామ్‌ప్రసాద్‌, సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌.

Updated Date - Apr 04 , 2025 | 02:41 AM