ఆసక్తికరమైన మలుపులతో...

ABN , Publish Date - Apr 04 , 2025 | 02:35 AM

సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన చిత్రం ‘జాక్‌’. ‘కొంచెం క్రాక్‌’ ఉపశీర్షిక. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో బీవీఎ్‌సఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ప్రకాశ్‌రాజ్‌, వీకే నరేశ్‌ కీలక పాత్రలు పోషించారు...

సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా తెరకెక్కిన చిత్రం ‘జాక్‌’. ‘కొంచెం క్రాక్‌’ ఉపశీర్షిక. బొమ్మరిల్లు భాస్కర్‌ దర్శకత్వంలో బీవీఎ్‌సఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ప్రకాశ్‌రాజ్‌, వీకే నరేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 10న సినిమా విడుదలవుతోంది. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘‘ప్రేమకథల స్పెషలిస్ట్‌, దర్శకుడు భాస్కర్‌ తన పంథా మార్చి తెరకెక్కించిన ఈ చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. సినిమా చాలా వేగంగా సాగుతూ ఆసక్తికరమైన మలుపులతో అలరిస్తుంది’’ అని అన్నారు. ‘‘సిద్ధు అద్భుతమైన వ్యక్తి. ఆయనతో సినిమా చేయడం చాలా సులభం. ప్రతీ ఒక్కరిలో ఓ జాక్‌ ఉంటాడు. ఆ జాక్‌ ఎవరు అనేది ఎవరికి వాళ్లే తెలుసుకోవాలి. నన్ను నమ్మి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను ఈ సినిమా నిరాశపరచదు’’ అని దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌ చెప్పారు. ‘‘సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అన్ని రకాల ప్రేక్షకులూ చూడదగ్గ చిత్రమిది. తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది’’ అని నిర్మాత బీవీఎ్‌సఎన్‌ ప్రసాద్‌ తెలిపారు. ‘‘దర్శకుడు భాస్కర్‌తో పనిచేయడం మరిచిపోలేని అనుభవం. సిద్ధు నుంచి సెట్స్‌లో ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇందులో నా పాత్ర చాలా బాగుంటుంది’’ అని వైష్ణవి చైతన్య అన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 02:35 AM