Mr Bachchan: అంత ఆసక్తికరంగా లేని మిస్టర్ బచ్చన్' టీజర్

ABN , Publish Date - Jul 29 , 2024 | 11:39 AM

దర్శకుడు హరీష్ శంకర్ తన సినిమా టీజర్ కన్నా, తను మీడియాతో మాట్లాడిన మాటలే ఎక్కువగా వివాదాలుగా, వైరల్ మారాయి. టీజర్ ఎవరూ పట్టించుకోలేదని అంటున్నారు, అదీ కాకుండా ఆ టీజర్ లో విషయం లేదని, ఆసక్తికరంగా కూడా లేదని అంటున్నారు.

Ravi Teja as Mr Bachchan

దర్శకుడు హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో వస్తున్న 'మిస్టర్ బచ్చన్' టీజర్ నిన్న విడుదలైంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తోంది. నిన్న జరిగిన ఈ టీజర్ ఫంక్షన్ కి రవితేజ వస్తాడు అనుకున్నారు, కానీ అతను రాలేదు. మామూలుగానే దర్శకుడు హరీష్ శంకర్ తన మాటలతో, సామాజిక మాధ్యమాల్లో వివాదాలతో ఉంటూ వస్తూ ఉంటాడు. అందుకేనేమో నిన్నటి టీజర్ కన్నా, అతను మీడియా వాళ్ళతో మాట్లాడిన మాటలే ఎక్కువ వైరల్ అయినట్టుగా కనపడుతోంది. (Mr Bachchan Teaser is not an impressive one)

అందుకే 'మిస్టర్ బచ్చన్' టీజర్ కూడా అంత గొప్పగా లేకపోవటంతో, టీజర్ ని ఎవరూ పట్టించుకోలేదు. హరీష్ శంకర్ వ్యాఖ్యలు, వివాదాల మాటలే ఎక్కువగా అందరినీ ఆకర్షించాయని అనుకుంటున్నారు. ఈ 'మిస్టర్ బచ్చన్' సినిమా ఇంతకు ముందు అజయ్ దేవగన్ నటించిన 'ది రైడ్' సినిమాకి అనువాదంగా చేస్తున్నారు. (Harish Shankar and Ravi Teja combination Mr Bachchan teaser is out)

mrbachchan.jpg

అయితే ఈ సినిమా ఎక్కువగా ప్యాకేజీలో హరీష్ శంకర్ తీశాడని పరిశ్రమలో వినిపిస్తున్న మాట. అందుకనే ఈ సినిమాపై అంతగా ఆశలు పెట్టుకొనవసరం లేదు అని కూడా అంటున్నారు. నిన్నటి టీజర్ ఫంక్షన్ కి రవితేజ రాకపోవటంతో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రవి తేజకి ఈ సినిమా ఫలితం ముందే తెలుసు, అందుకే రాలేదు అని, లేదు అతనికి ప్రొడక్షన్ హౌస్ కి మధ్య ఇంకా కొన్ని విషయాలు తేలలేదు అందుకని రాలేదు, అని అక్కడికి వచ్చిన వాళ్ళు మాట్లాడుకోవటం కనిపించింది. రవితేజ రాకపోవటంతో వచ్చిన అభిమానులు చాలా నిరాశ పడ్డారు. టీజర్ లో సినిమా గురించి ఇంకా కొంచెం రివీల్ చేస్తే బాగుండేది, హరీష్ శంకర్ టీజర్ లో విషయం చూపించలేకపోయారు అని కూడా అంటున్నారు.

Updated Date - Jul 29 , 2024 | 03:23 PM