బాలయ్య.. ప్రభాస్‌.. గోపీచంద్‌లకు బెట్టింగ్‌ సెగ

ABN , Publish Date - Mar 23 , 2025 | 04:59 PM

ప్రస్తుతం టాలీవుడ్‌ చుట్టూ బెట్టింగ్‌ (Betting apps) యాప్‌ల ఇష్యూ నడుస్తోంది. సెలబ్రిటీలు బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేయడంపై ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి.


ప్రస్తుతం టాలీవుడ్‌ చుట్టూ బెట్టింగ్‌ (Betting apps) యాప్‌ల ఇష్యూ నడుస్తోంది. సెలబ్రిటీలు బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేయడంపై ఇప్పటికే పలువురిపై కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈ ఇష్యూ నందమూరి బాలకృష్ణ(BalaKrishna), ప్రభాస్‌(Prabhas), గోపీచంద్‌ల(Gopichand) తలకూ చుట్టుకున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో స్ర్టీమ్‌ అవుతున్న అన్‌ స్టాపబుల్‌ షోలో ఓ బెట్టింగ్‌ యాప్‌ని ప్రమోట్‌ చేయడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రామారావు అనే వ్యక్తి ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. (Allegations on Balayya)

ఫన్‌ 88 బెట్టింగ్‌ యాప్‌కి బాలకృష్ణ, ప్రభాస్‌, గోపీచంద్‌ ప్రమోట్‌ చేశారని, దీని వల్ల చాలామంది డబ్బులు నష్టపోయారని ఫిర్యాదులో పేర్కొన్నారు రామారావు. అన్‌ స్టాపబుల్‌ షోకి ప్రభాస్‌ గోపీచంద్‌లు గెస్ట్‌లుగా హాజయైున సంగతి తెలిసిందే! ఈ ఎపిసోడ్‌లో ఫన్‌ 88 అనే బెట్టింగ్‌ (Betting app Allegations on Balayya) యాప్‌ని ప్రమోట్‌ చేశారు. ఈ ఎపిసోడ్‌ చూసి బెట్టింగ్‌ యాప్‌ డౌన్లోడ్‌ చేసుకున్నాననీ,. ఫన్‌ 88 యాప్‌లో బెట్టింగ్‌ ఆడి 83 లక్షలు పోగొట్టుకున్నానని ఓ వ్యక్తి మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో బాలకృష్ణ, ప్రభాస్‌, గోపీచంద్‌లపై కేసు నమోదైనట్లు సమాచారం. 

Updated Date - Mar 23 , 2025 | 05:26 PM