Kamakshi Bhaskarla: కెరీర్ గురించి పోలిమేర బ్యూటీ ఏమంటుంది అంటే..
ABN , Publish Date - Mar 29 , 2025 | 07:23 PM
కామాక్షి భాస్కర్ల ఎంచుకునే స్క్రిప్ట్‌లు, చేస్తున్న సినిమాలు, పోషిస్తున్న పాత్రల గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కామాక్షి భాస్కర్ల దూసుకుపోతోన్నారు.
కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) ఎంచుకునే స్క్రిప్ట్‌లు, చేస్తున్న సినిమాలు, పోషిస్తున్న పాత్రల గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కామాక్షి భాస్కర్ల దూసుకుపోతోన్నారు. ఆమె ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కుతన్న హారర్ థ్రిల్లర్ '12A రైల్వే కాలనీ'తో (12A Railway colony) ) బిజీగా ఉన్నారు. కామాక్షి ఇటీవలే నవీన్ చంద్ర సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. మరో వైపు బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజ్ పోలిమేర మూడో పార్ట్ (polimera3) షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతోన్నారు. ప్రస్తుతం డిఫరెంట్ ప్రాజెక్టులతో కామాక్షి బిజీగా ఉన్నారు. కామాక్షి మాట్లాడుతూ '‘మూడు చిత్రాలలోనూ నేను విభిన్న పాత్రలను పోషిస్తున్నాను. ఈ మూడు ప్రాజెక్టులు నా కెరీర్ కు కీలకం కానున్నాయి. ఒకే టైంలో మూడు ప్రాజెక్టులకు పని చేయడం కష్టమైనప్పటికీ, సినిమా పట్ల ప్యాషన్, ప్రేమ ఉండటంతో కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. నాకు సినిమా సెట్లలో ఉండటమే ఇష్టంగా ఉంటుంది’' అని అన్నారు.
12A రైల్వే కాలనీ అయినా, పొలిమేర అయినా, సైతాన్ అయినా కామాక్షి తన నటనతో చెరగని ముద్ర వేశారు. ఇలా ప్రతీ సారి డిఫరెంట్ పాత్రలను పోషిస్తుండటంపై స్పందిస్తూ.. ‘సినిమాలోని పాత్రకు కనెక్ట్ అవ్వడం, ఆ కారెక్టర్‌కు నిజాయితీగా ఉండటం వల్ల యాక్టర్ తనలోని కొత్త కోణాలను ఆవిష్కరించుకోగలరు. సవాల్‌గా అనిపించే పాత్రలను ఎంచుకోవడం, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి నటించే పాత్రలనే నేను ఎంచుకుంటూ వస్తున్నాను. స్క్రిప్ట్, డైరెక్టర్ విజన్‌కు అనుగుణంగానే పని చేస్తున్నాను. నా కోసం పాత్రలు రాసే దర్శకులకే క్రెడిట్ ఇస్తాను. నాలోని నటిని బయటకు తీసుకొచ్చేది వారే. ప్రతి పాత్ర ఒక కొత్త ప్రయాణం అని నేను నమ్ముతాను’ అని అన్నారు.