Kamal Haasan - Kalki: నాలో నాకే సందేహం మొదలైంది.
ABN , Publish Date - Jun 25 , 2024 | 03:11 PM
ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న 'కల్కి 2898 ఎడీ’ (Kalki2898 AD) చిత్రం గురించి సినీ ప్రియులంతా ఎంతో ఆతురగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే! ఆ సమయం రానే వచ్చింది.
ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న 'కల్కి 2898 ఎడీ’ (Kalki2898 AD) చిత్రం గురించి సినీ ప్రియులంతా ఎంతో ఆతురగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే! ఆ సమయం రానే వచ్చింది. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో ఎంతో శక్తిమంతమైన అశ్వత్థామ పాత్రను బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ (Amitab bachchan) పోషించారు. ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఆసక్తికర అప్‌డేట్స్ ఇస్తూ అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు చేశారు అమితాబ్. తాజాగా మరోసారి ఆయన ఆసక్తికర పోస్ట్ పెట్టారు. అలాగే కమల్‌హాసన్ (Kamal haasan) కూడా ఈ సినిమాను అంగీకరించడానికి ఏడాది ఆలోచించినట్లు చెప్పారు.
అమితాబ్ బచ్చన్ తాజాగా తన బ్లాగ్‌లో ఓ పోస్ట్ చేశారు. ‘కల్కి రిలీజ్‌కు ముందు రామచరిత మానస్ చదవడం ఆనందంగా ఉంది. ఎన్ని యుగాలు గడచినా కొన్ని శాశ్వతంగా ఉంటాయి. శాశ్వతమైన శాంతి, ప్రశాంతత కోసం నేను ప్రార్థిస్తున్నాను. దీన్ని ఎప్పుడైనా.. ఎవరైనా చదవొచ్చు’ అని రాసుకొచ్చారు. అందులోని పద్యాలకు అర్థాలను వివరించారు.
ప్రమోషన్స్ లో బాగంగా సినిమా టీమ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు నాగ్ అశ్విన్‌పై అమితాబ్ ప్రశంసలు కురిపించారు. ‘‘కల్కి’లో విజువల్స్ నమ్మశక్యం కావు. అన్నింటినీ తెరపై అద్భుతంగా చూపించారు. ఇంతగొప్ప ప్రాజెక్ట్‌లో భాగం కావడం నాకు ఎప్పటికీ మర్చిపోలేని ఓ అనుభవం. నాగ్‌అశ్విన్ ఈ కథ చెప్పి వెళ్లిన తర్వాత ‘ఇతను ఏం తింటున్నాడు. ఇంత గొప్పగా రాశాడు’ అని నేను చాలా సేపు ఆలోచించాను’ అని అన్నారు.
ఇక విశ్వనటుడు కమల్ హాసన్ కూడా స్పందించారు. ఇందులో ఆయన సుప్రీం యాస్కిన్ పాత్రను ఆయన పోషించారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన సినిమా గురించి మాట్లాడుతూ "ఈ పాత్రను అంగీకరించడానికి నేను ఏడాది సమయం తీసుకున్నా. దర్శకుడు పాత్ర గురించి చెప్పగారు నాలో నాకే సందేహం మొదలైంది. నేను చేయగలనా అనిపించింది. గతంలో చాలా సినిమాల్లో విలన్‌గా నటించాను. కానీ, ఇది వాటికి మించినది. భిన్నమైనది. అందుకే ఈ ప్రాజెక్ట్ సైన్ చేయడానికి ఏడాది ఆలోచించా’ అన్నారు.