L2 Empuraan: ఎంపురాన్’ నిర్మాతను విచారించిన ఈడీ
ABN , Publish Date - Apr 07 , 2025 | 07:17 PM
మోహన్ లాల్ కీలక పాత్రలో నటించిన ‘ఎల్ 2: ఎంపురాన్’ సినిమా నిర్మాతల్లో ఒకరైన గోకులం గోపాలన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం విచారించారు.
మోహన్ లాల్ (Mohan lal) కీలక పాత్రలో నటించిన ‘ఎల్ 2: ఎంపురాన్’ (L2: Empuraan) సినిమా నిర్మాతల్లో ఒకరైన గోకులం గోపాలన్ (Gokulam Gopalan)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోమవారం విచారించారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనల ఉల్లంఘన కేసులో ఈడీ (ED) ఆయన్ను ప్రశ్నించింది. గోకులం ఫైనాన్స్ సంస్థ ద్వారా రూ. వేల కోట్ల అనధికార నగదు లావాదేవీలు జరిపినట్టు గోపాలన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దర్యాప్తులో భాగంగా.. కొన్ని రోజుల క్రితం చెన్నై, కొచ్చి తదితర నగరాల్లోని గోపాలన్ కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. చెన్నైలోని ఆఫీస్‌లో రూ.1.5 కోట్లు సీజ్ చేసినట్టు తెలిసింది.
మోహన్‌లాల్ (Mohanlal) హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన చిత్రమిది. ‘ఎల్ 2: పురాన్’ను వివాదాలు చుట్టిముట్టిన సంగతి తెల్సిందే. అయినా వసూళ్ల విషయంలో రికార్డు సృష్టించింది. తక్కువ సమయంలోనే రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి మలయాళ సినిమాగా నిలిచింది.