Samantha: పెద్ద కలలతో మా చిన్న ప్రేమను అందిస్తున్నాం
ABN , Publish Date - Apr 07 , 2025 | 05:39 PM
అగ్ర కథానాయిక సమంత (Samantha) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. 2012లో ట్విటర్ ఖాతా ఓపెన్ చేశారు. అయితే, సమంత ఇందులో తన పోస్ట్‌లు అన్నిటినీ ఇటీవల డిలీట్ చేశారు.
అగ్ర కథానాయిక సమంత (Samantha) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. 2012లో ట్విటర్ ఖాతా ఓపెన్ చేశారు. అయితే, సమంత ఇందులో తన పోస్ట్‌లు అన్నిటినీ ఇటీవల డిలీట్ చేశారు. అప్పటి నుంచి ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా సమంత ఎక్స్‌లోనూ రీఎంట్రీ ఇచ్చారు. సోమవారం తొలి పోస్ట్‌ను పంచుకున్నారు. నటిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అలరించిన సమంత.. 2023లో నిర్మాతగా మారారు. ‘ట్రాలాలా (tralala) మూవింగ్ పిక్చర్స్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించారు. ఇప్పుడీ నిర్మాణ సంస్థ తీసిన తొలి సినిమా ‘శుభం’ (SubhaM)విడుదల కానుంది. ఈ విషయాన్ని చెబుతూ ఎక్స్‌లో సోమవారం పోస్ట్ పెట్టారు. ‘పెద్ద కలలతో మా చిన్న ప్రేమను మీకు అందిస్తున్నాం. ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా. ఇది నిజంగా నాకు ఎంతో ప్రత్యేకం. గొప్ప ప్రారంభం’’ అని రాసుకొచ్చారు.
సామ్ రీఎంట్రీపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘వెల్‌కమ్ బ్యాక్ సామ్’, ‘క్వీన్ ఈజ్ బ్యాక్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈమెను ఎక్స్‌లో 10.2 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. సమంత వెండితెరపై కనిపించి ఏడాదిన్నర అవుతోంది. విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’లో నటించారు. ఆమె నటించిన ‘సిటడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్టించింది. లాస్టియర్ తన పుట్టినరోజున ‘మా ఇంటి బంగారం’ అనే ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. అయితే దానిపై ఇప్పటి దాకా ఎలాంటి అప్‌డేట్ రాలేదు.