Sumaya Reddy: డియర్ ఉమ టీజర్ వచ్చేసింది
ABN , Publish Date - Apr 08 , 2025 | 10:23 AM
ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ కు కేరాఫ్ అడ్రస్ శివ నిర్వాణ. ఆయన చేతుల మీదగా 'డియర్ ఉమ' టీజర్ ను మేకర్స్ లాంచ్ చేయించారు.
తెలుగమ్మాయి సుమయ రెడ్డి (Sumaya Reddy) హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా ‘డియర్ ఉమ’ (Dear Uma) అనే చిత్రం నిర్మించింది. ఈ నెల 18న ఈ సినిమా జనం ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్ (Prithvi Amber) హీరోగా నటించారు. ఈ మూవీకి లైన్ ప్రొడ్యూసర్‌గా నగేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా నితిన్ రెడ్డి వ్యవహరించారు. సాయి రాజేష్ మహాదేవ్ స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. రథన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించగా, రాజ్ తోట కెమెరామెన్‌గా వర్క్ చేశారు.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా 'డియర్ ఉమ' నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్ కు చక్కని స్పందనే లభించింది. తాజాగా 'డియర్ ఉమ' టీజర్‌ను రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు శివ నిర్వాణ (Shiva Niravana) టీజర్ ను ఆవిష్కరించి, చిత్ర బృందాన్ని అభినందించారు. టీజర్ ఎంతో బాగుందని, ప్రేమతో పాటుగా అంతర్లీనంగా మంచి సందేశాన్నిచ్చే ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ లా ఇది ఉండబోతోందని అర్థమైందన్నారు.
టీజర్ విషయానికి వస్తే... ‘గుడిలో దేవుడి వద్ద చేసే ప్రార్థనల కన్నా.. హాస్పిటల్‌లో నాలుగు గోడల మధ్య చేసే ప్రార్థనేలా ఎక్కువ’ అంటూ ప్రారంభమైన టీజర్‌లో, ‘రెండు జీవితాలు.. రెండు ప్రపంచాలు.. రెండు భావోద్వేగాలు.. ఇద్దరి ప్రేమలు.. ఒక హృదయం.. ఒక యుద్దం’, ‘పేషెంట్స్‌కి, డాక్టర్లకు మధ్య మీలాంటి కమిషన్స్ ఏజెన్సీ, బ్రోకర్లు ఉండకూడదు సర్.. దీని కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను’ అనే డైలాగ్స్ ఎమోషన్ తో కూడుకుని ఆకట్టుకునేలా ఉన్నాయి. ''హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో ఈ సినిమాను లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించామని, ఈ నెల 18న రాబోతున్న తమ చిత్రానికి తప్పని ఆదరణ లభిస్తుందనే నమ్మకం ఉందని సుమయ రెడ్డి తెలిపారు. కమల్ కామరాజు, సప్తగిరి, అజయ్ ఘోష్, ఆమని, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, రూపలక్ష్మీ ఇందులో కీలక పాత్రలు పోషించారు.
Also Read: Samyuktha: ముచ్చటగా మూడోసారి....
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి