Siddu Jonnalagadda: బెటర్ అవుట్‌పుట్ కోసం అవన్నీ సహజంగా జరుగుతాయి..
ABN , Publish Date - Apr 06 , 2025 | 02:26 PM
సిద్థూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) రూపొందించిన చిత్రం ‘జాక్’ (jack). వైష్ణవి చైతన్య కథానాయిక. ఇందులో హీరోయిన్‌గా మొదట పూజా హెగ్డేను అనుకున్నట్లు వస్తోన్న వార్తలపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్థూ జొన్నలగడ్డ స్పందించారు.
సిద్థూ జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) రూపొందించిన చిత్రం ‘జాక్’ (jack). వైష్ణవి చైతన్య కథానాయిక. ఇందులో హీరోయిన్‌గా మొదట పూజా హెగ్డేను అనుకున్నట్లు వస్తోన్న వార్తలపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సిద్థూ జొన్నలగడ్డ స్పందించారు. ఆ వార్తలో నిజం లేదని స్పష్టం చేశారు. పూజాహెగ్డేను తీసుకోవాలనే ఆలోచన ఏమాత్రం లేదని చెప్పారు. తొలుత వైష్ణవి చైతన్య పేరేనని చెప్పారు. అంతే కాదు మరో విషయం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు సిద్ధూ. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్, సిద్ధూల మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయన్న వార్తలపై కూడా మాట్లాడారు. సినిమాల విషయంలో అలాంటివి సహజం అన్నారు.
‘‘మా ఇద్దరి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తిన మాట వాస్తవమే. మేము సినిమా కోసమే కొట్టుకున్నాం. తీవ్రంగా చర్చించుకున్నాం. సినిమా అన్నాక ఇలాంటివి సహజం. అంతేకానీ, మేము ఏమాత్రం వ్యక్తిగత కారణాల వల్ల తిట్టుకోలేదు. సోషల్‌మీడియాలో పెట్టే ఒక చిన్న పోస్ట్ విషయంలోనే స్నేహితులు మఽధ్య అభిప్రాయ బేధాలు వస్తుంటాయి. అలాంటిది రెండున్నర గంటల సినిమా చేస్తున్నప్పుడు ఇలాంటివి ఉండటంలో తప్పు లేదు’’ అని సిద్థూ జొన్నలగడ్డ అన్నారు. అనంతరం ఆయన ‘టిలు స్వ్కేర్’ గురించి మాట్లాడుతూ.. ‘‘నిజం చెప్పాలంటే, ఆ సమయానికి నాకు ‘టిలు స్వ్కేర్’ చేయడం ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే, ‘డీజే టిల్లు’ చేయడానికి నా వద్ద ఒక కథ ఉంది. ఆ ధైౖర్యంతోనే సినిమా చేశా. కానీ సీక్వెల్‌కు వచ్చేసరికి నా వద్ద కథ లేదు. కరోనా కారణంగా పార్ట్ 1కు రావాల్సిన గుర్తింపు ఒకింత తగ్గిందనే భావన మాత్రం మా టీమ్‌లో ఉండిపోయింది. కాబట్టి, మరోసారి ఇదే తరహా కథ చేసి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకుందామని నిర్ణయించుకుని సుమారు రెండేళ్లపాటు కష్టపడి సీక్వెల్ చేశాం. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డబ్బులు బాగానే కలెక్ట్ చేసింది. డబ్బు కోసమే సినిమాలు చేయాలనుకుంటే టిల్లు తర్వాత నాకు ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. వాటికి అంగీకారం తెలిపితే నాకు పెద్ద మొత్తంలో డబ్బు అందేది. కానీ, నా ఫోకస్ మొత్తం ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలనే దానిపైనే ఉంది. అందుకే రెండేళ్లు శ్రమించి సినిమా చేశాం’’ అని అన్నారు.