Anil Ravipudi: 'ఎఫ్‌4' కాదు.. ఆ మాటలు నమ్మవద్దు!

ABN , Publish Date - Jul 05 , 2024 | 08:26 PM

దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ విరామ దర్శనం సమయంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

Anil Ravipudi:  'ఎఫ్‌4' కాదు.. ఆ మాటలు నమ్మవద్దు!

దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం వీఐపీ విరామ దర్శనం సమయంలో ఆయన స్వామి వారి సేవలో పాల్గొన్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడిన ఆయన దిల్‌రాజు బ్యానర్‌లో వెంకటేశ్‌ (Venkatesh) హీరోగా సినిమా చేస్తున్నట్లు చెప్పారు. ఆ సినిమాపై వస్తున్న వదంతులను నమ్మొద్దని అన్నారు. ఇది ఎఫ్‌ 4 (F4)కాదని స్పష్టం చేశారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి ఓ హీరోయిన్ కాగా, ఐశ్వర్యా రాజేష్‌ మరో నాయికగా ఎంపిక చేశారు. ఇందులో ఐశ్వర్యా వెంకటేష్‌కు భార్యగా, మీనాక్షి వెంకీకి ప్రేయసిగా కనిపిస్తోందని తెలుస్తోంది.


Updated Date - Jul 05 , 2024 | 08:26 PM