Manju Warrier: తమిళంలో మంచి పాత్రలు లభిస్తున్నాయి

ABN , Publish Date - Sep 17 , 2024 | 09:20 PM

ఇతర భాషల్లో కంటే కోలీవుడ్‌లో మంచి కథా పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయని హీరోయిన్‌ మంజు వారియర్‌ అన్నారు. ప్రస్తుతం ఆమె సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘వేట్టయన్‌’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి విడుదలైన ఓ పాటలో ఆమె డ్యాన్స్ బాగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో బీభత్సంగా రీల్స్ పడుతున్నాయి. తాజాగా ఆమె ‘వేట్టయన్‌’ ఛాన్స్ గురించి మాట్లాడుతూ..

Vettaiyan Movie Still

ఇతర భాషల్లో కంటే కోలీవుడ్‌లో మంచి కథా పాత్రల్లో నటించే అవకాశాలు వస్తున్నాయని హీరోయిన్‌ మంజు వారియర్‌ (Manju Warrier) అన్నారు. ప్రస్తుతం ఆమె సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘వేట్టయన్‌’ (Vettaiyan) చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి విడుదలైన ఓ పాటలో ఆమె డ్యాన్స్ బాగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో బీభత్సంగా రీల్స్ పడుతున్నాయి. ఆమె వయసు గురించి మాట్లాడుతూ.. అస్సలు తగ్గేదేలే అన్నట్లుగా ఆమె దూసుకువెళుతుందనేలా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ‘వేట్టయన్‌’ సినిమాలో తన పాత్ర గురించి తాజాగా మంజు వారియర్ చెప్పుకొచ్చింది.

Also Read- Poonam Kaur: అప్పట్లో నా మాట పట్టించుకోలేదు.. త్రివిక్రమ్ పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు

ఈ సినిమాలో అవకాశంపై ఆమె స్పందిస్తూ.. ‘వేట్టయన్‌ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌ (Super Star Rajinikanth) భార్యగా నటించాను. నా పాత్ర పేరు తార. రజనీ వివిధ రకాలైన స్టైల్స్‌ ఇపుడు చూస్తున్నాను. ‘వేట్టయన్‌’ చిత్రంలో అవకాశం రావడం, రజనీ సరసన నటించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సినిమాలోని ‘మాసిలాయో’ పాటకు అనేక మంది సినీ కళాకారులతో కలిసి డ్యాన్స్‌ చేసిన అనుభవం ఎన్నటికీ మరిచిపోలేనిది. ఇతర భాషల్లో కంటే తమిళంలో మంచి పాత్రలు లభిస్తున్నాయి. ‘అరసన్‌’ నుంచి ‘తుణివు’ చిత్రం వరకు నేను పోషించిన పాత్రలు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ‘వేట్టయన్‌’ చిత్రంలో మరో కొత్త పాత్ర పోషించాను. ‘విడుదలై-2’, ‘మిస్టర్‌ ఎక్స్‌’లో కూడా నేను పోషించిన పాత్రలు అలాంటివేనని పేర్కొన్నారు.


Manju-Warrier.jpg

‘వేట్టైయాన్ - ది హంట‌ర్‌’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 10న భారీ ఎత్తున విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టి.జె.జ్ఞాన‌వేల్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలు ‘2.0, ద‌ర్బార్‌, లాల్ స‌లామ్’ వంటి చిత్రాల త‌ర్వాత ర‌జినీకాంత్, లైకా ప్రొడ‌క్ష‌న్స్ క‌ల‌యిక‌లో రాబోతున్న నాలుగో సినిమా ‘వేట్టైయాన్- ది హంట‌ర్‌’.

Also Read- Love Sitara: పెళ్లికి ముందే నిజాలు బయటపడ్డాయ్.. శోభితా ధూళిపాళ పెళ్లి అవుతుందా?

Read Latest Cinema News

Updated Date - Sep 17 , 2024 | 09:20 PM